Homeఎంటర్టైన్మెంట్Grandma Bigg Boss Viral Video: బిగ్ బాస్ కి వెళ్లేందుకు ఆ బామ్మ చేసిన...

Grandma Bigg Boss Viral Video: బిగ్ బాస్ కి వెళ్లేందుకు ఆ బామ్మ చేసిన పనికి అందరూ షాక్, ఆ వీడియో నాగ్ చూస్తే?

Grandma Bigg Boss Viral Video: బిగ్ బాస్ షోకి ఎంత క్రేజ్ ఉందో? పెద్దగా చదువుకోని సామాన్యులను కూడా ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో? ఆ షోలో పాల్గొనాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో? చెప్పేందుకు.. ఈ స్టోరీ నిదర్శనం. ఓ బామ్మ బిగ్ బాస్ షోలో అవకాశం ఇవ్వాలని హోస్ట్ నాగార్జునను రిక్వెస్ట్ చేసిన తీరు సోషల్ మీడియాను ఊపేస్తోంది..

బిగ్ బాస్(BIGG BOSS TELUGU) షోలో ఏదైనా జరగొచ్చు. సామాన్యులను కూడా ఓవర్ నైట్ స్టార్స్ చేయగల సత్తా ఈ రియాలిటీ షోకి ఉంది. సీజన్ 7లో కంటెస్ట్ చేసిన పల్లవి ప్రశాంత్ ఉందంతమే అందుకు ఉదాహరణ. పల్లె వాతావరణంలో పెరిగిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో వీడియోలు చేసేవాడు. అతడు చాలా కాలం ప్రయత్నం చేసి బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. మహామహులు కూడా బోల్తా కొట్టే బిగ్ బాస్ షోలో సత్తా చాటాడు. బడా సెలెబ్స్ కి షాక్ ఇస్తూ టైటిల్ అందుకున్నాడు.

Also Read: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?

పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక చాలా మంది సామాన్యులు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అందుకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాడు. మేకలు కాసే కుర్రాడు, భవన నిర్మాణ కార్మికుడు… బిగ్ బాస్ షోలో అవకాశం ఇవ్వాలంటూ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామాన్యులకే కాదు సెలెబ్స్ కి కూడా ఆ కోరిక ఉంటుంది. తక్కువ రెమ్యూనరేషన్ కి లేదా అసలు డబ్బులు ఇవ్వకపోయినా బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వండి అని, అభ్యర్ధించేవారు లక్షల్లో ఉంటారు.

తాజాగా ఓ బామ్మ హోస్ట్ నాగార్జునను రిక్వెస్ట్ చేసిన తీరు సంచలనంగా మారింది. ఆమె వీడియో వైరల్ అవుతుంది. నాగార్జున గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. మీరు షోకి వచ్చిన ప్రతిసారి మంచిగా టీలు, కాఫీలు ఇస్తాను. రోటి పచ్చళ్ళు, రుచికరమైన వంటకాలు చేసి పెడతాను. నాకు చదువు రాదు. ఆట, పాటలు రావు. కానీ వంట బాగా చేస్తాను. అందరికీ చక్కగా వండిపెడతాను… ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాగార్జున గారు… అంటూ ఆ వీడియోలో సదరు మహిళ వేడుకుంది.

Also Read: హరిహర వీరమల్లు సినిమాకు ‘ముసుగేసుకొని వచ్చారు..’ తర్వాత ఏం జరిగిందంటే? వైరల్ వీడియో…

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ బామ్మ కామెంట్స్ మీద నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో వంట చేసే బదులు హోటల్ పెట్టుకో.. అని సలహా ఇస్తున్నారు. ఆ వీడియో నాగార్జున చూస్తే ఆయన ఎలా స్పందిస్తారు అనే చర్చ నడుస్తోంది. సీజన్ 4లో గంగవ్వ కంటెస్ట్ చేసింది. అనారోగ్య కారణాలతో రీత్యా ఆమె స్వచ్ఛందంగా బయటకు వచ్చింది. అయితే సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆమె కలను నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యం నెరవేర్చింది.

Exit mobile version