Hari Hara Veera Mallu Premiere: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం ఆయన చేస్తున్న సినిమాలతో గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన ఎన్ని సినిమాలు చేసిన కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో థియేటర్లో సందడి చేస్తున్నాడు… ఇక ఈ సినిమా ఈనెల 24వ తేదీన రిలీజ్ అయింది. అయితే 23వ తేదీ అర్ధరాత్రి నుంచే సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ అయితే వేశారు. ఇక ప్రసాద్ ఐమాక్స్ లో వేసిన ప్రీమియర్ షో కి కొంతమంది ఆడవాళ్లు ఎర్ర కండువాలు మొహం మీద కప్పుకొని వాళ్ళ ఫేసులు కనిపించకుండా కవరు చేస్తూ థియేటర్లోకి ఎంటర్ అయ్యారు. సినిమా చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ముఖం మీద నుంచి పరదలు తీయలేదని అలాగే సినిమా చూశారని తెలుస్తోంది. ఇక వీళ్లకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
మరి ఎందుకని వాళ్ళు అలా ఎర్ర పరదాలు కప్పుకొని వచ్చారు అంటూ కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న పరదా అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వాళ్లు ఇలాంటి ఒక స్ట్రాటజీని మైంటైన్ చేశారని చెబుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతి ఒక్కరికి అటెన్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే తమ సినిమాకి ప్రమోషన్ లభించాలి అంటే ఆ సినిమాను టార్గెట్ చేసి ఏదైనా వినూత్నంగా చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశారని చెబుతున్నారు. మొత్తానికైతే ఆగస్టు 22వ తేదీన అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో నటించిన పరద సినిమా రిలీజ్ అవుతుండడం విశేషం…
Also Read: ఈవారం ఓటీడీలో పండగ చేసుకోండి.. ఫ్యూజులు ఎగిరిపోయే సినిమాలు
ఇక ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ కి పెద్దగా సక్సెసులైతే దక్కడం లేదు. టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆ తర్వాత సక్సెస్ లను సాధించలేక పోతుంది. మరి ఈ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఈ మూవీ తో ఎలాగైనా సరే సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతోంది…
#Paradha ladies watch #HariHaraVeeraMallu at Prasad’s! #Paradha movie directed by Praveen Kandregula (Cinema Bandi & Subham fame) is releasing on 22 August! pic.twitter.com/sO7AgByzMt
— idlebrain jeevi (@idlebrainjeevi) July 24, 2025