Liquor Scam Investigation: మద్యం కుంభకోణం( liquor scam) కేసులో తెలంగాణ నేతలకు ప్రమేయం ఉందా? నాటి ప్రభుత్వ పెద్దలు కూడా సహకరించారా? హైదరాబాదులోనే స్కెచ్ వేశారా? ఏపీ మద్యం కుంభకోణానికి అక్కడే బీజం పడిందా? ఇప్పుడు ఇవే అందరిలో అనుమానాలు. ఏపీ మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. జాతీయ స్థాయిలో కూడా చర్చ నడుస్తోంది. దాదాపు రూ.3,500 కోట్ల రూపాయలను నేతలు కొల్లగొట్టారని ప్రత్యేక దర్యాప్తు బృందం తన చార్జి షీట్ లో స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో 12 మంది అరెస్టు అయ్యారు. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టుతో మరింత సంచలనంగా మారింది మద్యం కుంభకోణం. అయితే తాజాగా శ్రవణ్ రావు అనే వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. అయితే ఆయన తెలంగాణ ఫోన్ టాపింగ్ కేసులో నిందితుడు కావడం గమనార్హం.
Also Read: జగన్ పై గులకరాయి దాడి.. ప్రధాన నిందితుడు అదృశ్యం!
శ్రవణ్ రావు అరెస్టుతో..
అయితే ఇప్పుడు ఏపీ మద్యం కుంభకోణంలో తెలంగాణకు చెందిన శ్రవణ్ రావును( Shravan Rao) విచారించడం మాత్రం ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్టు అయ్యింది. అయితే మద్యం కుంభకోణం కేసులో నిందితులకు దుబాయిలో శ్రవణ్ రావు ఆశ్రయం కల్పించారన్నది ప్రధాన అభియోగం. ఈ అంశంపై విచారించేందుకే ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో శ్రవణ్ రావు విజయవాడలోని సిట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. అయితే మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికి శ్రవణ్ రావు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు.
ఒకేసారి రెండు అంశాలు..
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ( Phone tapping) కేసులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించినట్లు ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగు కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ను ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ జరపడం అనేది మరింత చర్చకు దారితీస్తోంది. తప్పకుండా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు.. కొంతమంది ఏపీ మద్యం కుంభకోణానికి సహకరించి ఉంటారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇదే అంశంపై టిడిపి అనుకూల మీడియా పతాక స్థాయిలో కథనాలు రాస్తోంది. ఇవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.
Also Read: కేసీఆర్, కేటీఆర్.. వాళ్ల కుటుంబం.. పాపం కవిత లేదు!
మొత్తం హైదరాబాద్ నుంచి..
ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి వ్యూహం మొత్తం హైదరాబాదు( Hyderabad) నుంచి జరిగింది. హైదరాబాదులో పలుమార్లు సిటింగులు కూడా జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి సైతం వెల్లడించారు. కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చేశారు. ఇప్పుడు అదే రాజ్ కసిరెడ్డి సన్నిహితులపై దృష్టి పెట్టింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే సిట్ తన రెండో చార్జ్ షీట్లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఏపీ మద్యం కుంభకోణం తీగలాగితే తెలంగాణలో డొంక కదులుతుండడం విశేషం.