Guntur Kaaram movie : గుంటూరు కారం సినిమా పై ఆడియన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా చూసిన ఆడియన్స్ నిర్మొహమాటంగా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో తిడుతున్నారు. అసలు కథ ఏమైనా ఉందా .. భారం మొత్తం మహేష్ బాబు మీదే వేశారు అంటూ మండి పడుతున్నారు. కథ, కథనం, డైలాగుల విషయంలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని ఆరోపిస్తున్నారు. కానీ మహేష్ బాబు కోసం సినిమా చూడొచ్చని చెబుతున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమాలో ఓ బ్లండర్ మిస్టేక్ జరిగింది. అదేమిటంటే సౌండ్ మిక్సింగ్ సరిగాలేదు. సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు ప్రధానంగా ఈ ఆరోపణ చేస్తున్నారు. కొన్ని చోట్ల అసలు డైలాగులు అర్థం కాలేదని. ముఖ్యంగా యూఎస్ ప్రింట్ లో ఈ సమస్య ఉందని కామెంట్లు వస్తున్నాయి. రెండు పాటలు తప్ప ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. ఇది సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి కీలక విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి గుంటూరు కారం హడావుడిగా పూర్తి చేసి విడుదల చేశారు. రిలీజ్ కు మూడు వారాల ముందు షూటింగ్ పూర్తయింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే సినిమా అవుట్ ఫుట్ లో మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. కథ, కథనాలు వదిలేసి మహేష్ క్యారెక్టర్ పైనే ఆధారపడి తెరకెక్కించారు. పైగా త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ రీమేక్స్ మీద ఉన్న శ్రద్ధ తాను చేస్తున్న సినిమాల పై లేకపోవడం శోచనీయం.
గుంటూరు కారం షూటింగ్ మొదలయ్యాక కూడా త్రివిక్రమ్ బ్రో మూవీకి కథనం, డైలాగ్స్ అందించడంలో బిజీ అయ్యాడు. సరైన స్క్రిప్ట్ లేకుండా గుంటూరు కారం సినిమాను తెరకెక్కించి వదిలాడు. ఈ చిత్రానికి మహేష్ బాబు ప్లస్ .. మహేష్ కోసం సినిమా చూడొచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో ఆశించిన ఫలితం దక్కించుకోలేకపోయింది.