https://oktelugu.com/

Shobha Shetty: బిగ్ బాస్ ఎఫెక్ట్… బంపర్ ఛాన్స్ కోల్పోయిన శోభ శెట్టి!

శోభ శెట్టిని కాపాడేందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసారంటూ విమర్శలు వినిపించాయి. ఎట్టకేలకు 14వ వారం శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చిన శోభ కార్ ర్యాలీ చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 21, 2024 / 04:42 PM IST
    Follow us on

    Shobha Shetty: బిగ్ బాస్ షో ఎంత మేలు చేస్తుందో అంత కీడు కూడా చేస్తుంది. నెగిటివ్ ఇమేజ్ తో హౌస్ నుండి బయటకు వస్తే కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శోభ శెట్టి విషయంలో ఇదే జరిగిందని టాక్. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అయిన శోభ బిహేవియర్ ప్రేక్షకులకు విసుగు పుట్టేలా చేసింది. ఆమె యాటిట్యూడ్, తలబిరుసు, నోటికి వచ్చినట్లు మాట్లాడే తీరు జనాలకు నచ్చలేదు. శోభ శెట్టిని ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు ప్రేక్షకులు. అయితే స్టార్ మా ఆమెను కాపాడిందనే వాదన ఉంది.

    శోభ శెట్టిని కాపాడేందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసారంటూ విమర్శలు వినిపించాయి. ఎట్టకేలకు 14వ వారం శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చిన శోభ కార్ ర్యాలీ చేసింది. ఈ క్రమంలో కొందరు ఆమెను ట్రోల్ చేశారు. ఆమెపై ఎంత నెగిటివిటి వచ్చిందో తెలుసుకున్న శోభ… పలుమార్లు క్షమాపణలు కోరింది. అంతా గేమ్ లో భాగమే. కావాలని చేసింది కాదు. తప్పు అనిపిస్తే క్షమించాలని శోభ శెట్టి వేడుకుంది.

    బిగ్ బాస్ షోతో ఉన్న ఇమేజ్ పోగొట్టుకున్న శోభ శెట్టికి బంపర్ ఆఫర్ చేజారిందనే మాట వినిపిస్తోంది. తాజాగా కార్తీక దీపం 2 ప్రకటించారు. 2023 జనవరిలో బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపం కి ముగింపు పలికారు. కార్తీక దీపం కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. అందుకే ఆ ఫ్రాంచైజ్ ని వదులుకోవడం ఇష్టం లేని స్టార్ మా కార్తీక దీపం కి సీక్వెల్ ప్రకటించింది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్ర చేసి నిరుపమ్, వంటలక్క పాత్రలో కనిపించిన ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్నారట. అయితే మోనిత రోల్ ఉండదు అంటున్నారు.

    అంటే శోభ శెట్టికి ఛాన్స్ లేదట. ఇదంతా బిగ్ బాస్ ఎఫెక్ట్ అట. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల్లో ఆమెకున్న ఇమేజ్ రీత్యా శోభ శెట్టిని ఈ సీరియల్ లో భాగం చేయడం మేకర్స్ కి ఇష్టం లేదని అంటున్నారు. ఎటూ పార్ట్ 1 లో మోనిత పాత్రను చంపేశారు. కాబట్టి మరో విలన్ ని తెరపైకి తేవాలని అనుకుంటున్నారట. శోభను కొనసాగించాలి అనుకుంటే మోనిత పాత్రను మరలా బ్రతికించవచ్చు. సీరియల్స్ లో ఇవి సాధారణమే. గతంలో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను చంపేసిన డైరెక్టర్…. టీఆర్పీ తగ్గడంతో మరలా బ్రతికించిన సంగతి తెలిసిందే….