PM Modi : ఉత్తరప్రదేశ్ కు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 10.23 లక్షల కోట్ల పనులకు ప్రధాని మోడీ చేతుల మీదుగా భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఇది ఒక రికార్డుగా చెప్పాలి.
చిన్న పరిశ్రమలు ( ఎంఎస్ఎంఈ) పాత్ర గురించి మోడీ చక్కగా వివరించారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఈ కుటీర పరిశ్రమలే ఉపాధి కల్పిస్తున్నాయి. దేశంలో 6.34 కోట్ల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి.ఇవన్నీ రిజిస్ట్రర్ కాకపోవచ్చు. జీడీపీలో 6 శాతం.. తయారీ రంగంలో 33 శాతంగా ఉన్నాయి. దేశం ఎగుమతుల్లో 45 శాతం ఈ చిన్న పరిశ్రమల నుంచే జరుగుతోంది.
12 కోట్ల మంది ప్రజలు దీనిపై ఉపాధి పొందుతున్నారు. రిజిస్ట్రర్ అయినవి 3.16 కోట్ల పరిశ్రమలే రిజిస్ట్రర్ అయ్యాయి. మిగతా కాలేదు.
ఎందుకు మోడీ లక్నో సదస్సులో చిన్న పరిశ్రమల్ని ప్రత్యేకంగా పొగిడాడు? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.