https://oktelugu.com/

Koratala Siva- NTR: ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా !

TKoratala Siva- NR: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అయితే కొరటాల ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో కొరటాల శివకు ఎన్టీఆర్ సినిమా పై ప్రశ్నలు ఎదురయ్యాయి. కొరటాల కూడా ఎన్టీఆర్ తో చేసే సినిమా పై స్పందించారు. ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ప్రస్తుతం […]

Written By: , Updated On : April 19, 2022 / 07:04 PM IST
Follow us on

TKoratala Siva- NR: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. అయితే కొరటాల ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో కొరటాల శివకు ఎన్టీఆర్ సినిమా పై ప్రశ్నలు ఎదురయ్యాయి. కొరటాల కూడా ఎన్టీఆర్ తో చేసే సినిమా పై స్పందించారు.

Koratala Siva- NTR

Koratala Siva- NTR

ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని కొరటాల తెలిపారు. అలాగే కొరటాల ఇంకేం మాట్లాడాడు అంటే.. ఆయన మాటల్లోనే.. ‘నాకు పాన్ ఇండియా అంటే నచ్చదు. పాన్ ఇండియా కోసం ఒకలా .. అలా కాకపోతే మరోలా కథలను నేను రాయను.

Also Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

బలమైన కథాకథనాలతో రాస్తే అందరూ చూస్తారు. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అలాంటి ఓ మంచి కథనే ఎన్టీఆర్ కోసం రాశాను’ అంటూ కొరటాల చెప్పుకొచ్చాడు. పైగా ఈ సినిమా కోసం కొరటాల భారీ తారాగణాన్ని తీసుకోబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ తో పాటు మరో హీరోయిన్ ను కూడా తీసుకోబోతున్నారు.

నిజానికి ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ జాన్వీ కపూర్ నే అని, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినప్పుడు కూడా హీరోయిన్ గా తారక్, జాన్వీ కపూర్ వైపే మొగ్గు చూపాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం జాన్వీ కపూర్, తారక్ సినిమాలో ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందట.

Koratala Siva- NTR

Koratala Siva- NTR

మొత్తానికి సీనియర్ ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబినేషన్ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో… ఇప్పుడు ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ కాంబినేషన్ కూడా ఆ స్థాయిలో హిట్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.

అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేసారు. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఓ పెద్ద సెట్ వేశారు. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందట.

Also Read:Chiranjeevi Old Movie: KGF మూవీ చిరంజీవి పాత సినిమాకి రీమేక్?? బయటపడ్డ షాకింగ్ నిజాలు

Tags