https://oktelugu.com/

Inaya Sultana : ప్రియుడిని పరిచయం చేసి షాక్ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ ఇనాయ సుల్తానా.. ఇంతకీ ఎవరీ లక్కీ ఫెలో! రొమాంటిక్ పిక్స్ వైరల్

Inaya Sultana దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది. అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తుంది. ఇదిలా ఉంటే .. తాజాగా ప్రియుడితో కలిసి ఇనాయ షేర్ చేసిన సెల్ఫీ లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. బాత్ రూమ్ లో టవల్ కట్టుకొని బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ వ్యక్తితో చాలా సన్నిహితంగా కనిపించింది. ఈ ఫోటో కింద యాంకర్ శివ కామెంట్ చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2024 9:44 pm
    Bigg Boss fame Inaya Sultana shocked by introducing boyfriend Gautham Koppishetty

    Bigg Boss fame Inaya Sultana shocked by introducing boyfriend Gautham Koppishetty

    Follow us on

    Inaya Sultana : ఇనాయ సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ గా అవతరించింది. అయితే తాజాగా ఇనాయ సుల్తానా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసి షాక్ ఇచ్చింది. అతనితో కలిసి దిగిన కొన్ని సెల్ఫీలు షేర్ చేసింది. ఇనాయ పోస్ట్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

    నటిగా కెరీర్ ప్రారంభించింది ఇనాయ సుల్తానా. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ సరైన గుర్తింపు రాలేదు. రామ్ గోపాల్ వర్మతో ఓ వీడియోలో కనిపించిన ఇనాయ అప్పట్లో ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 6 లో అవకాశం దక్కించుకుంది. హౌస్ లో 10 వారాలకు పైగా రాణించింది. హౌస్లో ఇనాయ ఫైర్ బ్రాండ్. ఆర్జే సూర్యతో ఎఫైర్ కూడా నడిపింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు.

    దీంతో సోషల్ మీడియానే నమ్ముకుంది. అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తుంది. ఇదిలా ఉంటే .. తాజాగా ప్రియుడితో కలిసి ఇనాయ షేర్ చేసిన సెల్ఫీ లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. బాత్ రూమ్ లో టవల్ కట్టుకొని బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ వ్యక్తితో చాలా సన్నిహితంగా కనిపించింది. ఈ ఫోటో కింద యాంకర్ శివ కామెంట్ చేశాడు.

    అతను తన బాయ్ ఫ్రెండ్ అని కన్ఫర్మ్ చేసింది. తన ప్రేమ నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఇనాయ బాయ్ ఫ్రెండ్ పేరు గౌతమ్ కొప్పిశెట్టి. అతను యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని తెలుస్తుంది. జిమ్ లో వీళ్ళ మధ్య ప్రేమ మొదలైంది. ఇప్పుడు రిలేషన్ లో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇనాయ షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇవేం సెల్ఫీ లు అంటూ ట్రోల్ చేస్తున్నారు.