https://oktelugu.com/

Virat Kohli : భూతల స్వర్గం కూడా దిగదుడుపే.. విరాట్ కోహ్లీ ఇల్లు అంతకుమించి ఉంది.. ఇంతకీ ఆ వీడియో చూశారా..

కాగా, విరాట్ టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్ విహారయాత్రలో ఉన్నాడు. శ్రీలంక టూర్ కు కూడా అతడు అందుబాటులోకి రాడు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడు. అన్నట్టు విరాట్ తన ఇంటికి సంబంధించి పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2024 / 09:32 PM IST

    Virat Kohli's most modern house in Alibaug

    Follow us on

    చుట్టూ పచ్చని చెట్లు.. సేద తీరేందుకు ఆహ్లాదకరమైన లాన్.. అందమైన ప్రకృతిని ఆస్వాదించేందుకు అద్భుతమైన ఓపెన్ ఏరియా.. ఈత కొట్టేందుకు విశాలమైన స్విమ్మింగ్ పూల్.. మనస్ఫూర్తిగా తినేందుకు అధునాతనమైన డైనింగ్ ఏరియా.. హాయిగా కబుర్లు చెప్పుకునేందుకు లివింగ్ రూమ్.. బంధువులు వస్తే పార్టీ చేసుకునేందుకు ప్రైవేట్ స్పేస్.. రాత్రి పడుకునేందుకు అత్యంత ఆధునికమైన బెడ్ రూమ్.. ఇది మాత్రమే కాదు ఎండాకాలంలో చల్లని వాతావరణం.. చలికాలంలో వెచ్చని వాతావరణం.. వర్షాకాలంలో అద్భుతమైన వెచ్చటి, చల్లటి కలబోతతో కూడిన వాతావరణం.. చదువుతుంటే అక్కడికి వెళ్లి పోవాలనిపిస్తోంది కదూ.. ఆ ప్రాంతం ఏమిటో తెలుసుకోవాలి అనిపిస్తోంది కదూ.. ఆగండి ఆగండి.. మీరు ఎంత ఖర్చుపెట్టినా అక్కడికి వెళ్లడం కుదరదు.. అక్కడ ఉండడం అసలు కుదరదు.. ఎందుకంటే పై అద్భుతాలు మొత్తం ఒక ఇల్లు సొంతం. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిదంటే..

    టీమిండియా స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్నాడు. తన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తన ఇన్ స్టా గ్రామ్ లో తాను నిర్మించుకున్న అందమైన గృహానికి సంబంధించిన ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. వీడియో ప్రారంభంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులకు విరాట్ కోహ్లీ పలు సూచనలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.. విరాట్ కోహ్లీ తాను నిర్మించుకుంటున్న ఇంటి చుట్టూ తిరగడం.. అక్కడ ఉన్న పచ్చని చెట్లను పరిశీలించడం.. ఈత కొలనులో స్వేచ్ఛగా ఈత కొట్టడం.. వేడివేడి కాఫీ తాగడం.. నిర్మాణ సంస్థ బాధ్యులతో ముచ్చటించడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. చూస్తుంటే ఆ ప్రాంతం అత్యంత విశాలంగా కనిపిస్తోంది. అద్భుతమైన ప్రకృతి మధ్య ఆ గృహం అధునాతన సౌకర్యాలతో అలరారుతోంది.. భారీ భవంతి లాగా కనిపిస్తున్న ఆ గృహం.. తన కలలను మొత్తం తీర్చిందని విరాట్ హావభావాలు చూస్తే అర్థమవుతోంది.

    విరాట్ కలల సౌధాన్ని ఆవాస్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థకు నిర్మాణ రంగంలో మంచి పేరు ఉంది. భారీ కాంప్లెక్స్ లు, సెలబ్రిటీలకు అద్భుతమైన గృహాలు నిర్మించిన చరిత్ర ఈ కంపెనీకి ఉంది. అందుకే తన గృహ నిర్మాణ బాధ్యతలు కూడా ఈ కంపెనీకే అప్పగించాడు విరాట్. అంతేకాదు కంపెనీ ప్రతినిధులకు ఎప్పటికప్పుడు తన సలహాలు సూచనలు అందించాడు. విరాట్ సలహాల మేరకే ఆవాస్ కంపెనీ ఇల్లు నిర్మించింది. ఆ ఇల్లు చూస్తుంటే భూతల స్వర్గాన్ని మించిపోయినట్లు కనిపిస్తోంది. ఆ ఇంట్లో ఉండడాన్ని విరాట్ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నట్టు ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. నవీ ముంబైకి దగ్గరలోని ముంబై సముద్రతీరంలో గల ‘అలీబాగ్ ’ బీచ్ఒడ్డున కొన్ని ఎకరాల్లో ఈ ఇల్లును నిర్మించాడు.

    కాగా, విరాట్ టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్ విహారయాత్రలో ఉన్నాడు. శ్రీలంక టూర్ కు కూడా అతడు అందుబాటులోకి రాడు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడు. అన్నట్టు విరాట్ తన ఇంటికి సంబంధించి పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది.