Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ చరిత్రలో ఆరుగురు కంటెస్టెంట్స్ ని ఫైనలిస్టులు గా ప్రకటించడం ఇదే మొదటిసారి. అంతే కాకుండా ప్రతి సీజన్ లో 15వ వారం లో వచ్చిన ఓటింగ్ ని బట్టి విజేతను ప్రకటించేవారు. కానీ ఈ సీజన్ లో మాత్రం 14, 15 వారాల ఓటింగ్ ని బట్టి విన్నర్ ని డిసైడ్ చేస్తాం అంటూ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. కాగా అర్జున్, ప్రశాంత్, శివాజీ, యావర్, అమర్ దీప్, ప్రియాంక ఫైనలిస్టులు గా నిలిచారు. ఇక వారిలో శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ మధ్య టైటిల్ పోరు నడుస్తుంది.
ఇక ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. అయితే గత వారం శివాజీ, అమర్ దీప్ కి ఫుల్ నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. దీంతో ప్రశాంత్ కి ఎక్కువ ఓటింగ్ నమోదైందని సమాచారం. 14వ వారం ఓటింగ్ లో లాభం పొందింది ప్రశాంత్ మాత్రమే. అయితే ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తే ప్రశాంత్ మొదటి స్థానంలో ఉన్నాడు. శివాజీ రెండవ స్థానంలో .. యావర్ మూడవ స్థానంలో ఉన్నారు. ఇక అమర్ దీప్ నాలుగో స్థానానికి పడిపోయాడు.
నిజానికి అమర్ కి ఫ్యామిలీ వీక్ తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. 12, 13 వారాల్లో అమర్ విన్నర్ అవుతాడు అని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే చేతులారా మొత్తం తలకిందులు చేసేసాడు అమర్. మొదటి వారంలో జరిగిన బి టెక్ ఎపిసోడ్ గుర్తు చేసేలా .. ప్రశాంత్ తో అర్థం లేకుండా వాదించాడు. ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించి మళ్ళీ నెగిటివ్ అయ్యాడు. దీంతో అమర్ దీప్ ఓటింగ్ చాలా వరకు తగ్గిపోయింది.
కానీ 15వ వారంలో భాగంగా బిగ్ బాస్ టాప్ 6 కంటెస్టెంట్స్ సంబంధించిన జర్నీ వీడియోలు చూపిస్తున్నారు. కాగా ముందు అమర్ దీప్ వీడియో చూపించారు. తర్వాత అర్జున్ వీడియో చూపించారు బిగ్ బాస్. అయితే అమర్ ఫ్యాన్స్ జర్నీ వీడియో చూసి ఫుల్ ఖుష్ అయ్యారు. ఏవీ ఎఫెక్ట్ కి నాలుగో స్థానంలో ఉన్న అమర్ దీప్ .. యావర్ ని కిందకి నెట్టి మూడో స్థానానికి వచ్చేశాడు. రోజు రోజుకు ఓటింగ్ ఊహించని విధంగా మారుతుంది. చూడాలి మరి ఏం జరుగనుందో.