https://oktelugu.com/

బిగ్ బాస్ ట్రెండ్స్ చూస్తుంటే ఈసారి అతడే విన్నర్?

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సగం సీజన్ పూర్తి చేసుకుంది. దీంతో బిగ్ బాస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టులలో విన్నర్ ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. బిగ్ బాస్-4 నుంచి ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు బయటికి వెళ్లారు. ఇప్పుడున్న కంటెస్టులు ప్రేక్షకులను అలరిస్తూ మరిన్ని వారాలు హౌస్ లో కొనసాగేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో గేమ్ ఉత్కంఠగా మారుతోంది. Also Read: బిగ్ బాస్-4: […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 11:15 AM IST
    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్-4 సగం సీజన్ పూర్తి చేసుకుంది. దీంతో బిగ్ బాస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టులలో విన్నర్ ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

    బిగ్ బాస్-4 నుంచి ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు బయటికి వెళ్లారు. ఇప్పుడున్న కంటెస్టులు ప్రేక్షకులను అలరిస్తూ మరిన్ని వారాలు హౌస్ లో కొనసాగేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో గేమ్ ఉత్కంఠగా మారుతోంది.

    Also Read: బిగ్ బాస్-4: ఈవారం డేంజర్ జోన్లో ఇద్దరు.? ఎవరు ఎలిమినేట్?

    ఈ సీజన్లో ఇప్పటివరకు ఏ కంటెస్టు కూడా కౌడ్ ఫేవరేట్ గా మారలేకపోయారు. దీంతో ఆడియెన్స్ ఎవరివైపు ఉన్నారా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియపై మాత్రం ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    బిగ్ బాస్ సీజన్ రియల్టీ షోలా కాకుండా డ్రామా షోగా మారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ లో డ్రామాలు ఆడుతున్న వారే కొనసాగుతున్నారని.. రియల్ గేమ్ ఆడేవారినే నిర్వాహాకులు బయటికి పంపుతున్నారనే టాక్ విన్పిస్తోంది.

    ప్రస్తుత కంటెస్టుల్లో అభిజిత్ ఓటింగులో దూసుకెళుతున్నాడు. అయితే అతడు బయటి నుంచి పీఆర్ ఏజెన్సీ ద్వారా ఓటింగులో మ్యానిప్యులేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతడు ఇప్పటి వరుకు బిగ్ బాసులో బెస్ట్ ఫార్మమెన్స్ ఇవ్వలేదనే టాక్ ఉంది.

    అయినప్పటికీ అతడే బిగ్ బాస్ ఓటింగులో ముందుండటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ‘బిగ్ బాస్’ సైతం అతడు తుమ్మినా.. దగ్గినా చూపిస్తూ ఫోకస్ చేస్తున్నాడని ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బయటి నుంచి ఓట్లను మ్యానిప్యులేషన్ చేసేవారికి బిగ్ బాస్ కిరీటం దక్కితే.. ఇక రియల్టీ షో ఎందుకనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Also Read: సుడిగాలి సుధీర్ కు కరోనా సోకిందా?.. జబర్ధస్త్, ఢీ షోల పరిస్థితేంటి?

    బిగ్ బాస్ సీజన్ మధ్యలోనే ఇలాంటి ఆరోపణలు వస్తుండటంతో ఓట్ల మ్యానిప్యులేషన్ పై నిర్వాహాకులు దృష్టిసారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేకుంటే ఇకపై బిగ్ బాస్ కు వచ్చే కంటెస్టులంతా పీఆర్ ఏజెన్సీలతో టై అప్ అయి రావాల్సి వస్తుందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. అయితే ఈసారి విన్నర్ ఎవరనేది మాత్రం ఉత్కంఠతను రేపేలా కన్పిస్తోంది.