https://oktelugu.com/

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో 2,624 వాలంటీర్ల ఉద్యోగాలు..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి వద్దకు చేరాలనే లక్ష్యంతో గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున దాదాపు 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి పథకం గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారానే అమలవుతోంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందజేస్తామని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 22, 2020 11:10 am
    Follow us on


    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటి వద్దకు చేరాలనే లక్ష్యంతో గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున దాదాపు 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. జగన్ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి పథకం గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారానే అమలవుతోంది.

    అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందజేస్తామని జగన్ సర్కార్ చెబుతూ అదే విధంగా అందేలా చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,624 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. https://apgv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కాగా రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలతో పాటు క‌మ్యూనికేష‌న్ స్కిల్స్, అవగాహన ఆధారంగా ఉద్యోగానికి అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు జిల్లాల పరిధిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీకాకుళం జిల్లాలో 451, నెల్లూరు జిల్లాలో 211 పోస్టులు ఖాళీగా ఉండగా, చిత్తూరు జిల్లాలో 981, అనంతపురం జిల్లాలో 981 పోస్టులు ఉన్నాయి.

    శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులకు 22వ తేదీ, నెల్లూరు జిల్లా అభ్యర్థులకు 24వ తేదీ, చిత్తూరు జిల్లా అభ్యర్థులకు 25వ తేదీ, అనంతపురం జిల్లా అభ్యర్థులకు 31వ తేదీని చివరితేదీగా నిర్ణయిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు వేతనం రూపంలో లభిస్తుంది.