Gandhi Tatha Chettu Movie Review
Gandhi Tatha Chettu Movie Review: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే కొంతమంది దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…ఇక ఇదిలా ఉంటే సుకుమార్ కూతురు అయిన సుకృతి వేణి లీడ్ రోల్ లో నటించిన ‘గాంధీ తాత చెట్టు’ (Gandhi Thata Chettu) అనే సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. సగటు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
గాంధీ అంటే విపరీతమైన మమకారం ఇష్టం ఉన్న రామచంద్రయ్య(ఆనంద్ చక్రపాణి) తన మనవరాలికి గాంధీ అనే పేరును పెడతాడు. ఇక తను తన మనవరాలికి కూడా గాంధీయా వాదాన్ని తెలియజేస్తూ పెంచుతాడు. తద్వారా ఆమె కూడా గాంధీయవాదాన్ని అనుసరిస్తూ అహింస మార్గంలో నడుస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రామచంద్రయ్య పెట్టిన ఒక మొక్క చెట్టు లాగా మారుతుంది. దాని మీద ఆయన మమకారాన్ని పెంచుకుంటాడు. తద్వారా ఆయన చనిపోయేటప్పుడు చెట్టుని జాగ్రత్తగా చూసుకోమని తన మనవరాలకు చెబుతాడు. దాంతో ఆమె గాంధీయా వాదాన్ని అనుసరిస్తూ చెట్టును ఎలా కాపాడుకుందో తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా దర్శకురాలు అయినా పద్మావతి మల్లాది గతంలో కొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేసింది. ముఖ్యంగా మనమంత, మహానటి, రాధే శ్యామ్ లాంటి సినిమాలకు రచయిత్రి గా పనిచేసి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆ అనుభవంతోనే ‘గాంధీతాత చెట్టు’ అనే సినిమాకి దర్శకత్వం వహించింది. మరి ఆమె దర్శకత్వ ప్రతిభ చాలావరకు మెచ్చుకునే విధంగా ఉంది. నిజానికి చెట్టు ఎలాంటి ఎమోషన్ తో అయితే ఉంటుందో ఆ ఎమోషన్స్ ని స్క్రీన్ మీద చాలా బాగా పండించారు. ఇక ఆ అమ్మాయికి చెట్టుకి మధ్య ఉండే ఎమోషన్స్ కూడా చాలా బాగా చూపించారు.
ముఖ్యంగా రామచంద్రయ్య చనిపోయినప్పుడు చెట్టు ఎలా అయితే బాధపడుతుందో దాని వాయిస్ ఓవర్ లో చెప్పి కన్నీళ్లు తెప్పించారు. అలాంటి ఎమోషనల్ సీన్స్ ను పండించడం అంత ఈజీ కాదు…ఇలాంటి కొన్ని ఎమోషనల్ సీన్లు సినిమా చూసిన ప్రతి ఒక్కరి హృదయానికి తాకుతాయనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ సినిమా యావత్ ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా వాళ్ళందరికీ ఒక చక్కని అనుభూతిని కూడా అందిస్తుంది… ఇక దర్శకత్వ ప్రతిభలో పద్మావతి చాలా వరకు తన మార్క్ చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చాడు… పద్మావతి ఎంచుకున్న పాయింట్ ని స్క్రీన్ మీద చాలా బాగా చూపించారు.
దానివల్లే ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఆమె ఎక్కడ తడబడకుండా ఒక ఫ్లోలో ముందుకెళ్లారు… ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో సినిమా లోని కొన్ని సీన్లు డాక్యుమెంటరీని చూస్తున్నామా అన్నట్టుగా అనిపిస్థాయి. ఎందుకంటే మెలో డ్రామా ఎక్కువవ్వడం వల్ల సినిమాను చూసే ప్రేక్షకుడు అక్కడక్కడ కొంత వరకు నిరాశ చెందే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో నటించిన ‘సుకృతి వేణి’ చాలా అద్భుతమైన నటనను కనబరిచింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆమె గుండు చేయించుకుంది అని చెప్పడంలోనే సినిమా మీద ఆమె డెడికేషన్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆనంద చక్రపాణి కూడా తాత పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పటివరకు ఆయనకు ఇలాంటి పాత్ర అయితే రాలేదు. ఇంకా ఈ సినిమాలో ఈయన పోషించిన పాత్రతో ఆయనకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఇక మీద కూడా ఆయనకు అంతకుమించి మంచి పాత్రలు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి….
ఇక స్నేహితులుగా నటించిన నేహాల్,భాను ప్రకాష్ లు కూడా అక్కడక్కడా హాస్యాన్ని పండించే ప్రయత్నం అయితే చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఓవరాల్ గా ఆర్టిస్టులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించడమే కాకుండా కొన్ని సీక్వెన్స్ ల్లో అయితే వాళ్ళ ప్రాణం పెట్టి నటించారనే చెప్పాలి…
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికొస్తే రీ ఇచ్చిన మ్యూజిక్ ఎక్స్ట్రాడినర్ గా నిలిచింది. ముఖ్యంగా పాటలతో పాటు బ్యా గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయిందనే చెప్పాలి. ఈ సినిమాలోని షాట్స్ ను చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక ఎడిటర్ కూడా కత్తెరకు కొన్నిచోట్ల పని చెబుతూ చాలా షార్ప్ ఎడిట్ చేశాడు…
ప్లస్ పాయింట్స్
స్టోరీ
సుక్రితా యాక్టింగ్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ స్లో అయింది…
మెలో డ్రామా ఎక్కువైంది…
కొన్ని అనవసరపు సీన్స్…
రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5l5