
Bigg Boss Beauty: ఉయ్యాల జంపాల చిత్రంలో సునీత పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అమాయకత్వం నిండిన టీనేజర్‌గా తన నటనతో యావత్ ప్రేక్షక, చిత్రలోకాన్ని తనవైపునకు తిప్పుకొంది. సినిమా విజయం తర్వాత చేసింది కొద్ది సినిమాలే అయినా “వాసి కన్నా రాశి గొప్పది” అన్నట్లుగా ఆయా సినిమాల్లో తనదైన ముద్రవేసి ముందుకు సాగుతోంది. బిగ్‌బాస్–3 కంటెస్టెంట్‌గా బుల్లితెరపై తన పాపులారిటీ ఏంటో తెలియజెప్పింది. ఆమే పునర్నవి భూపాలం.
రంగస్థలం, వెండితెరపై మెరుస్తున్న నయాతార పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో కూల్‌గా, క్యూట్‌గా ముద్దుముద్దు పలుకులతో ఆకట్టుకున్న ఈ తార, హీరోయిన్‌గానూ పలు అవకాశాలను అందిపుచ్చుకుంది. బిగ్ బాస్–3 కంటెస్టెంట్‌గా పాపులరైంది.

నటన లోనే కాకుండా చదువులో కూడా ఒక అడుగు ముందే ఉంటుంది పునర్ణవి భూపాలం. సైకాలజీ, జర్నలిజం లో డిగ్రీ పట్టా పొందింది. కొద్దిరోజులు చదువుకి విరామం ఇచ్చి ఇండస్ట్రీలో లో బాగా బిజీ అయ్యింది. ఇప్పుడు చదువుని మళ్ళీ కంటిన్యూ చేయబోతుంది ఈ అందాల ముద్దుగుమ్మ. బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసిన పున్ను ఇప్పుడు మాస్టర్స్ కూడా పూర్తి చెయ్యాలని అనుకుంటుంది. దానికోసం లండన్ వెళ్తుంది.
బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన వితిక షేరు కి పునర్ణవి కి మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకంటూ ఒక ఇమేజ్ నీ క్రియేట్ చేసుకుంది వితిక. ఇపుడు పునర్ణవి చేత కూడా యూట్యూబ్ ఛానెల్ ని ఓపెన్ చేయించింది. సోషల్ మీడియా ద్వారా తన స్నేహితురాలికి గుడ్ విషెస్ చెప్తూ, లండన్ అందాలని వ్లోగ్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చెయ్యాలేని కోరింది.
ఇలా బిగ్ బాస్ 3 ముద్దు గుమ్మ పునర్ణవి భూపాలం పై చదువుల కోసం రెండు సంవ్సరాలు ఇండియాని విడిచి లండన్ వెళ్ళిపోతుందన్నమాట.
