Perni Nani: ఆల్ లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్నినాని సమీక్ష

ఆన్ లైన్ పద్దతిలో సినిమా టెక్కట్ అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉదని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పలిచిందన్నారు. ఆన్ లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్ వీ ప్రసాద్, ఆది శేషగిరి […]

Written By: Suresh, Updated On : September 20, 2021 4:11 pm
Follow us on

ఆన్ లైన్ పద్దతిలో సినిమా టెక్కట్ అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉదని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పలిచిందన్నారు. ఆన్ లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్ వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆల్ లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వల్ల సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం తరఫున తాము నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించి పరిష్కారం తీసుకుంటామన్నారు.

నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడారు. ఒకప్పుడు 1800 థియేటర్లు ఉండేవి, ఇప్పడవి 1200లకు పడిపోయాయి. వాటిలో ఐదారొందల థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఆ థియేటర్ లను పవర్ టారిఫ్ సమస్య వేధిస్తోంది. శాలరీలు, డీజిటల్ ఛార్జీలు పెరిగాయి. అప్పట్లో సిని పరిశ్రమకు రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా సాయం చేశారో అదేవిధంగా జగన్ ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు.