spot_img
Homeఎంటర్టైన్మెంట్Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్...

Divi Vadthya: నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటి అంటూ బిగ్ బాస్ బ్యూటీ హాట్ కామెంట్స్..

Divi Vadthya: ఈమధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కొంతమంది యంగ్ హీరోయిన్లు అందాల ఆరబోతలతో యూత్ ని పిచ్చెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు అయితే సబ్ స్క్రిప్షన్ అనే ఛాయస్ కూడా పెట్టి వాటి ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. అత్యధిక శాతం మంది హీరోయిన్లు మాత్రం, అందాలను ఆరబోస్తే తమకు సినిమా అవకాశాలు వస్తాయి అనే మైండ్ సెట్ తో ఉన్నారు. అలా అందాలు ఆరబోసే యంగ్ హీరోయిన్స్ లో ఒకరు దివి. ఈమె బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్. ఈ షో ద్వారా ఈమె తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. అంతకు ముందు పలు తెలుగు సీరియల్స్ లో నటించింది కానీ , గుర్తింపు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో సంపాదించుకున్నది మాత్రం బిగ్ బాస్ షో తోనే. ఈ షో తర్వాత ఆమెకు సోషల్ మీడియా లో కూడా ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.

ఇన్ స్టాగ్రామ్ లో ఈమెని లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదిస్తోంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేయగా, మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేసింది. ఇకపోతే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా ని నేను ఒక ఆదాయ వనరు లాగా ఉపయోగిస్తుంటాను. నేటి కాలం లో ప్రతీ గల్లీకి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు, వారి వ్యాపారాలు, షాపులు , సేల్స్ అన్నీ సోషల్ మీడియా ద్వారానే జరుగుతున్నాయి. సోషల్ మీడియా ని సరిగ్గా ఉపయోగించుకుంటే మన జీవితాలను మార్చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ పై ఆమె స్పందిస్తూ ‘నేను కామెంట్స్ ని చాలా సరదాగా తీసుకుంటాను. వాటిని నేను ప్రశంసలుగా భావిస్తాను. నన్ను తిట్టినా , ఒకవేళ ఎవరైనా సెక్సీ గా ఉన్నవని అన్నా , చూసి నవ్వుకొని ఎంజాయ్ చేస్తానే తప్ప , మనసుకి తీసుకోను’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అందాల ఆరబోతల విషయం గురించి మాట్లాడుతూ ‘సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోవడం కోసం నేను సోషల్ మీడియా ని ఒక మాధ్యమం లాగా వాడుకుంటున్నాను , అందులో తప్పేంటి?.. నేను కత్తిలా ఉంటాను , నాకు కూడా అవకాశాలు ఇవ్వండి అని చూపించుకోవడానికే ఇంతకు మించిన అవకాశం మరొకటి ఉంటుందా?, నాకున్న ఏకైన పవర్ ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఇన్ స్టాగ్రామ్ ఒక్కటే’ అంటూ చెప్పుకొచ్చింది దివి. ఉన్నది ఉన్నట్టు ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడిన దివి తీరుపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Oktelugu Epaper