https://oktelugu.com/

Arohi Rao: నేను మోసపోయాను మీరు జాగ్రత్తగా ఉండండి… బిగ్ బాస్ ఆరోహి సంచలన వీడియో

ఆరోహిరావు మోసానికి గురైందట. మీరు కూడా అప్రమత్తంగా ఉండండి అంటూ... ఆమె ఓ వీడియో విడుదల చేసింది. విషయంలోకి వెళితే ఆమె ఆన్లైన్ సెల్లింగ్ యాప్స్ ఫ్లిప్ కార్ట్, మీ షోలలో రెండు వస్తువులు ఆర్డర్ చేశారట.

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2023 / 06:46 PM IST

    Arohi Rao

    Follow us on

    Arohi Rao: బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న ఆరోహి అలియాస్ అంజలి పాపులారిటీ పొందింది. షోలో అమ్మడు ఎక్కువ కాలం ఉండలేదు. అయితే గలగలా మాట్లాడుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కంటెస్టెంట్ ఆర్జే సూర్యతో ఆరోహిరావు సన్నిహితంగా ఉండేది. అనూహ్యంగా నాలుగో వారమే ఆమె బిగ్ బాస్ జర్నీ ముగిసింది. ఉంది కొద్దిరోజులే అయినా… ఆరోహిరావు గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ ప్రముఖ ఛానల్ లో సెటైరికల్ వార్తలు చదివే యాంకర్ గా వ్యవహరిస్తోంది.

    కాగా ఆరోహిరావు మోసానికి గురైందట. మీరు కూడా అప్రమత్తంగా ఉండండి అంటూ… ఆమె ఓ వీడియో విడుదల చేసింది. విషయంలోకి వెళితే ఆమె ఆన్లైన్ సెల్లింగ్ యాప్స్ ఫ్లిప్ కార్ట్, మీ షోలలో రెండు వస్తువులు ఆర్డర్ చేశారట. నాలుగు రోజుల క్రితం ఒక డెలివరీ రావడంతో రెండింటిలో ఏదో ఒక ఐటెం వచ్చి ఉంటుందని చెక్ చేయకుండా యూపీఐ పేమెంట్ చేసిందట. తీరా ఐటెం ఓపెన్ చేసి చూస్తే వైట్ క్లాత్ మాత్రమే ఉందట.

    దాంతో మీ షో హెల్ప్ సెంటర్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే రెండు రోజుల్లో మెయిల్ వస్తుందని అన్నారట. నాలుగు రోజులైనా ఎలాంటి మెయిల్ రాలేదట. వాళ్ళ నుండి సరైన రెస్పాన్స్ లేదట. ఇది టోటల్ గా మీ షో యాప్ ఫ్రాడ్. మీరు కొనే ముందు జాగ్రత్తగా ఉండండి. నా మాదిరి మోసపోవద్దు… అని ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసింది. ఆరోహి రావు వీడియోపై నెటిజెన్స్ స్పందిస్తున్నారు. తమ అనుభవాలు గుర్తు చేసుకుంటున్నారు.

    ఇక వరంగల్ లో పుట్టిన ఆరోహిరావు తల్లి చిన్నప్పుడే మరణించింది. తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకుని ఆరోహిరావు, ఆమె తమ్ముడిని వదిలేశాడట. బామ్మ దగ్గర పెరిగిన ఆరోహిరావు ఎవరి సపోర్ట్ లేకుండా హైదరాబాద్ వచ్చి న్యూస్ యాంకర్ గా ఎదిగే ప్రయత్నం చేసి విజయం సాధించింది. ఈ విషయాలు ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పింది.