Ramoji Rao: మనకు నచ్చిన వాడు ఏం చేసినా బాగుంటుంది. గిట్టని వాడు ఎలాంటి ప్రజోపయోగమైన పని చేసినా చెడు లాగే కనిపిస్తోంది. ఇప్పుడు ఈనాడు రాస్తోంది కూడా అలానే ఉంది. మార్గదర్శి మీద దూకుడుగా వెళ్లడం, చంద్రబాబును స్కిల్ కేసులో జైలుకు పంపించడం, లోకేష్‌ను ఇరుకున పెట్టేందుకు రంగం సిద్ధం చేయడం వంటి పరిణామాలు సహజంగానే రామోజీరావుకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అసలే చంద్రబాబు అరెస్ట్‌తో మంట మీద ఉన్న ఆయనకు యూరిరెడ్డి పరిణామం మరింత చికాకు కలిగిస్తోంది. ఈక్రమంలో జగన్ వేసే ప్రతీ అడుగును భూతద్ధంలో పెట్టి చూస్తున్నాడు రామోజీ. అమలు చేస్తున్న ప్రతీ పథకంలోనూ లోపాలు వెతుకుతున్నాడు. రామోజీ ఇలా రాస్తోంటే జగన్ మీడియా దానికి కౌంటర్ ఇస్తోంది. వాస్తవానికి దశాబ్దాలుగా ఇలాగే ఈ మీడియా వైరం కొనసాగుతున్నప్పటికీ తాజా పరిణామాలతో ఈనాడు రామోజీ మరింత రెచ్చిపోతున్నాడు. అయితే ఈ ఊపులో చంద్రబాబు తప్పులను ఎత్తి చూపుతున్నాడు.
ఇప్పుడు జగన్ వైజాగ్ నుంచి పాలించబోతున్నాడు. వైజాగ్ రిషి కొండలో అల్‌రెడీ తన అధికారిక నివాసాన్ని నిర్మించుకుకున్నాడు. ఇన్ఫోసిస్ శాఖను ప్రారంభించాడు. త్వరలో మరిన్ని కార్పొరేట్ కంపెనీలు రాబోతున్నాయని హింట్స్ ఇస్తున్నాడు. సహజంగానే కంపెనీలు వస్తే రాష్ట్రానికిమంచి జరుగుతుంది. భూముల ధరలు పెరుగుతాయి. ఆర్థికంగా వృద్ధి నమోదవుతుం ది. రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. యువతకు ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా కూడా లబ్ధి చేకూరుతుంది. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో, విడిపోయిన తర్వాత ఏపీలో పలు కంపెనీలు వచ్చినప్పుడు ఇదే ఈనాడు ఆకాశానికి ఎత్తి రాసింది. కంపెనీలు కార్యాకలపాలు సాగించడం వల్ల ఆర్థిక చోదక శక్తి పెరుగుతోందిని ఠాంఠాం చేసింది. కానీ ఇప్పుడు ఏపీ పాలన రాజధాని వైజాగ్ కు మారడం వల్ల అంకమశివాలు ఎత్తుతోంది.
ఇదే సమయంలో జగన్ తన అధికారిక భవనం కోసం అంచనాలు పెంచాడని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు బొక్క పడుతోందని ఈనాడు ఈ రోజు ఏపీ సంచికలో రాసుకొచ్చింది. అయితే ఇక్కడ ఈనాడు దాస్తున్న అసలు విషయం ఏంటంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి(ఇది ఓ మారుమూల గ్రామంలో నిర్మించారు) చదరపు అడుగు నిర్మాణానికి 8,756 రూపాయలు చెల్లించింది. పైగా ఆ సచివాలయాన్ని అమర్చే విధానంలో నిర్మించారు. దీనికి అప్పట్లోనే 350 కోట్లు చెల్లించారు. సచివాలయంలో కేవలం భవనాలు మాత్రమే నిర్మించారు. మిగతాదంతా ఖాళీ స్థలమే. చంద్రబాబు కరకట్ట ప్రాంతంలో ఉండేందుకు లింగమనేని అనే ప్రైవేట్ వ్యక్తికి చెందిన గెస్ట్ హౌస్ ఆధునికీకరణ కోసం రూ. వంద కోట్ల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. అదే జగన్ అధికారిక నివాసం కోసం 314 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా ఆధునాతనంగా నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రేపొద్దున జగన్ ఓడిపోతే మరో ముఖ్యమంత్రి వస్తే అక్కడే ఉండి పరిపాలన సాగించాలి. ఈలెక్కన అది జగన్ సొంత ఇల్లు కూడా కాదు. కానీ ఈ నాడు ఈ రోజు ఏపీ ఎడిషన్‌లో రాసిన రాతలు మాత్రం అంకమశివాలను దాటిపోయాయి. మరి దీనికి సాక్షి ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి!