Bigg Boss Telugu 9 Agnipariksha: ప్రస్తుతం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ని అందించే ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు సినిమా ద్వారా మాత్రమే ఎంటర్టైన్మెంట్ ని అందుకున్న ప్రేక్షకులు..ఇప్పుడు సోషల్ మీడియా, ఓటిటి ప్లాట్ఫార్మ్స్, షోస్ ద్వారా ఎనలేని ఎంటర్టైన్మెంట్ ని పొందుతూనే ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో టెలివిజన్ రంగంలోనే బిగ్గెస్ట్ షోగా మంచి పాపులారిటిని సంపాదించుకున్న బిగ్ బాస్ ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు తొమ్మిదో సీజన్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే బిగ్ బాస్ లో కామన్ మ్యాన్స్ ను సైతం భాగం చేయాలనే ఉద్దేశ్యంతో అగ్నిపరీక్ష అనే ఒక షో ను ఏర్పాటు చేసి అందులో సక్సెస్ ఫుల్ గా నిలిచిన వారిని బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. మరి ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష కోసం ఎవరికి ఎందులో అయితే టాలెంట్ ఉంటుందో వాళ్ళు వాళ్ళ టాలెంట్ ని చూపిస్తూ ఒక మూడు నిమిషాల వీడియోని రికార్డ్ చేసి బిగ్ బాస్ టీం కి పంపిస్తే అందులో వాళ్ళు ఎవరికైతే జన్యున్ టాలెంట్ ఉందో వాళ్లను సెలెక్ట్ చేశారు…
Also Read: ‘బిగ్ బాస్’ అగ్ని పరీక్ష కోసం వచ్చిన 45 మందిలో సెలెక్ట్ అయిన 15 మంది వీళ్ళే…
ఇక దానికోసం కొన్ని లక్షల్లో వీడియోలైతే వచ్చాయట. వాటన్నింటినీ చూసి కేవలం 18 వేల మందిని మాత్రమే అందులో నుంచి సెలెక్ట్ చేశారు. ఇక ఆ తర్వాత వాళ్ళందరితో మాట్లాడి వాళ్లకు కొన్ని టాస్కులు విధించి మొత్తానికైతే అందులో నుంచి 10000 మందిని సెలెక్ట్ చేశారు. ఇక గ్రూప్ డిస్కషన్ చేయించి అందులో నుంచి 3000 మందిని సెలెక్ట్ చేసి పక్కన పెట్టారు.
ఇక దాంట్లో నుంచి కూడా మరికొన్ని టాస్క్ లను విధించి కేవలం 200 మందిని సెలెక్ట్ చేశారు. 200 మందిలో నుంచి మరికొన్ని ఎక్స్టా టాస్క్ లను ఆడించి ఫైనల్ గా 45 మందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో అంటూ దాన్ని కూడా టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇక అందులో సక్సెస్ ఫుల్ గా నిలిచిన వారిని బిగ్ బాస్ షోలోకి పంపే ప్రయత్నమైతే చేస్తున్నారు…
ఇక మొత్తానికైతే బిగ్ బాస్ షో కి ఒక్కో సీజన్ కి భారీగా అభిమానులు పెరిగిపోతున్నారు… ఇక ఈ షో మీద వస్తున్న నెగెటివ్ కామెంట్స్ ను పాజిటివ్ గా మార్చడానికి సామాన్య జనాలను సైతం ఇందులో భాగం చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం అనుకున్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే వీళ్ళందరికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిర్వహించి అందులో సక్సెస్ అయిన వాళ్ళను హౌస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది…