Homeఎంటర్టైన్మెంట్OG 2: 'ఓజీ 2' పై డైరెక్టర్ సుజిత్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు..? ఫ్యాన్స్ ని...

OG 2: ‘ఓజీ 2’ పై డైరెక్టర్ సుజిత్ ఎందుకు మౌనం వహిస్తున్నాడు..? ఫ్యాన్స్ ని వెంటాడుతున్న ప్రశ్న..

OG 2: గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సంచలన విజయం సాధించిన ‘ఓజీ’ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుండడం వల్ల అభిమానులు బాగా నిరాశకు గురయ్యారు. ఆయన తోటి హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటే , పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు? అనే ఆవేదన అభిమానుల్లో ఉండేది. ఆ ఆవేదనకు సరైన సమాధానం ఇచ్చింది ఓజీ చిత్రం. ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది , ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ ఎప్పుడో చెప్పారు , కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి పొలిటికల్ బిజీ వల్ల , అసలు ఈ ప్రాజెక్ట్స్ చేస్తాడా ? అనే అనుమానం అభిమానుల్లో ఉండేది.

ఆ అనుమానాలకు తెరదించుతూ రీసెంట్ గానే ‘ఓజీ 2’ కి సంబంధించిన అధికారిక ప్రకటన గ్రాండ్ పద్దతిలో జరిగింది. పవన్ కళ్యాణ్, సుజిత్ మధ్య జరిగిన ఒక సంభాషణకు సంబంధించిన వీడియో తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ వీడియో లో సుజిత్ స్టోరీ లోని కొన్ని అంశాలను వివరించగా, అది సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . వాటి పై కొన్ని వేల ఎడిటింగ్ వీడియోస్ వచ్చాయి , అభిమానులు ఒక సినిమానే AI ద్వారా తీసేసారు అనొచ్చు, ఆ రేంజ్ లో వైరల్ అయ్యింది ఈ కంటెంట్. అయితే ఈ సినిమాపై స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ట్వీట్ వేసినప్పటికీ కూడా, డైరెక్టర్ సుజిత్ నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్క పోస్ట్ కూడా పడలేదు.

కేవలం ప్రకటన వీడియో కి సంబంధించిన ట్వీట్ ని రీట్వీట్ చేసి సైలెంట్ గా ఉండిపోయారు. స్వయంగా పవర్ స్టార్ లాంటోడే ‘ఓజీ 2’ గురించి ట్వీట్ వేయగా, నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు?, అందుకు కారణం ఏంటి అని సోషల్ మీడియా లో సుజిత్ ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు ఫ్యాన్స్. కానీ సుజిత్ సైలెన్స్ కి బ్రేక్ మాత్రం పడడం లేదు. ఇందుకు కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న. అయితే సుజిత్ ‘ఓజీ 2’ కంటే ముందే నాని తో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని కమిట్ అయ్యారు. పవన్ ని కలిసే ముందు కూడా ఆయన ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ ని రెక్కీ చేయడం కోసం లండన్ లో ఉన్నారు. అకస్మాత్తుగా పవన్ నుండి కాల్ రావడం తో ‘ఓజీ 2’ కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ‘ఓజీ 2’ గురించి అధికారికంగా ట్వీట్లు , పోస్టులు వంటివి వేస్తె నాని ఏమైనా అనుకుంటాడు ఏమో అని సుజిత్ సైలెంట్ గా ఉన్నారా?, అసలు ఆయన సైలెన్స్ కి కారణం ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Oktelugu Epaper
Exit mobile version