Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో లేదు. బ్యాటింగ్ తనకు తగ్గట్టుగా లేదు. వ్యూహాలు తన రేంజ్ కు తగ్గట్టుగా లేవు. గుజరాత్ నుంచి ముంబైకి వచ్చిన తర్వాత దరిద్రాన్ని వెంట తీసుకొని వచ్చాడు. వైఫై లాగా శని అతడి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. వైవాహిక జీవితం సంక నాకిపోయింది. మరో అమ్మాయి జీవితంలోకి వచ్చింది. ఇంత జరిగినప్పటికీ ఏమైనా బాగుందా అంటే.. ఏది బాగోలేదు.
ఇటీవల సీజన్లో ముంబై జట్టు ఆట తీరు మారలేదు. ఆ జట్టుకు నాయకుడిగా ఉన్న హార్దిక్ పాండ్యా వ్యవహార శైలి మారలేదు. అవే ఓటములు.. అవే విమర్శలు.. అందువల్లే భుజాల మీదకు ఎత్తుకున్న ముంబై మేనేజ్మెంట్ కింద పడేసింది. వచ్చే సీజన్లో కెప్టెన్ గా కుదరదని చెప్పేసింది.. దీంతో హార్దిక్ పాండ్యాకు సినిమా అర్థమైంది. అందువల్లే జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు అతడు సంకేతాలు ఇస్తున్నాడు.
ఇటీవల సోషల్ మీడియాలో ముంబై మేనేజ్మెంట్ అధికారిక ఖాతాను అన్ ఫాలో చేశాడు. అంతకుముందు ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. దీంతోపాటు తాను ముంబై జట్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రత్యక్షంగా సంకేతాలిస్తున్నాడు. అంతేకాదు తన తర్వాతి స్టెప్ గురించి కూడా పరోక్షంగా ప్రకటిస్తున్నాడు.
జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం హార్దిక్ పాండ్యా వచ్చేసి సీజన్లో చెన్నై జట్టుకు నాయకుడిగా ఉండే అవకాశం ఉంది. చెన్నై మేనేజ్మెంట్ కూడా హార్దిక్ పాండ్యా మీద విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో అతడు కోరుకున్నట్టుగా భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఒప్పందంలో భాగంగా ముంబై జట్టుకు శివం దుబే, బ్రేవిస్ ను ఇచ్చేందుకు చెన్నై సిద్ధమైనట్టు తెలుస్తోంది. వీరిద్దరితోపాటు 10 కోట్ల నగదు కూడా ఇస్తుందని సమాచారం. ఈ విలువ మొత్తం 20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ఈ ఆఫర్లో ఆయుష్ మాత్రే ను మాత్రమే ముంబై మేనేజ్మెంట్ కోరిందని.. దీనికి చెన్నై మేనేజ్మెంట్ ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఇంకా ఈ ఒప్పందం గురించి పూర్తిస్థాయిలో చర్చలు జరగలేదని.. ప్రస్తుతం ఇవన్నీ ప్రారంభ దశలోనే ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కాకపోతే హార్దిక్ పాండ్యా చెప్పినట్టుగానే చెన్నై మేనేజ్మెంట్ వింటున్నదని.. జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే హార్దిక్ పాండ్యా


