https://oktelugu.com/

వైరల్ అవుతోన్న నాగబాబుతో అభిజీత్ ముచ్చట్లు !

‘బిగ్ బాస్’ షో ముగిసినా దాని తాలుకా వార్తలు మాత్రం ఇంకా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో సోహెల్, అభిజిత్, అఖిల్ పోటీ పడి మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా అభిజిత్ మెగా బ్రదర్ నాగబాబు మీటింగ్, దానికి సంబంధించిన వీడియో బయటకు రావడం, అది కాస్త బాగా వైరల్ కావడంతో నెటిజన్లు వీరిద్దరి ముచ్చట్లును తెగ వింటున్నారు. ఇంతకీ నాగ బాబు మాటల్లో.. ‘బిగ్ బాస్ షోలో నాకు […]

Written By:
  • admin
  • , Updated On : December 27, 2020 / 12:42 PM IST
    Follow us on


    ‘బిగ్ బాస్’ షో ముగిసినా దాని తాలుకా వార్తలు మాత్రం ఇంకా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో సోహెల్, అభిజిత్, అఖిల్ పోటీ పడి మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా అభిజిత్ మెగా బ్రదర్ నాగబాబు మీటింగ్, దానికి సంబంధించిన వీడియో బయటకు రావడం, అది కాస్త బాగా వైరల్ కావడంతో నెటిజన్లు వీరిద్దరి ముచ్చట్లును తెగ వింటున్నారు. ఇంతకీ నాగ బాబు మాటల్లో.. ‘బిగ్ బాస్ షోలో నాకు అవినాష్ మాత్రమే తెలుసు. మిగతా వాళ్లెవ్వరూ తెలీదు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రోమోస్ ను చూడటం లేదా తెలిసిన వాళ్లు ద్వారా షో గురించి తెలుసుకోవటం జరిగింది.

    Also Read:  ప్రీ వెడ్డింగ్ పార్టీలో మునిగితేలుతున్న సునీత-రామ్ జంట!

    ఆ తరువాత నేను కూడా రెండు మూడు సార్లు చూసిన దాంట్లో అభిజిత్ గురించే నేను ఎక్కువగా విన్నాను, అలాగే చూశాను కూడా. అతను గెలవాలని ఆశించాను.. గెలుస్తాడని నమ్మకంగా అనుకున్నాను. అలాగే నేను అనుకున్నట్టుగానే.. ఊహించినట్టుగానే.. కోరుకున్నట్టుగానే అభిజిత్ గెలిచి.. వచ్చాడు. అతను గెలిచాక అభిజిత్‌ను నేను కలవాలనుకున్నాను. కానీ బిగ్ బాస్ సక్సెస్‌తో బిజీగా ఉంటాడని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అతన్ని కలవలేదు. కానీ అతనే ఫోన్ చేసి కలుస్తాను అని చెప్పి వచ్చాడు. అలా మేం కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నామంటూ నాగబాబు తెలిపాడు.

    Also Read: క్రేజీ అంకుల్స్ ట్రైలర్: శ్రీముఖి గ్లామర్.. దారుణమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్

    అయితే నాగబాబు అభిజిత్ కలిసి బిగ్ బాస్ ఇంటి గురించి ఎలాంటి ముచ్చట్లు పెట్టుకున్నారు అంటే.. హౌస్ లో 105 రోజులు ఉండటం చాలా కష్టమని నాగబాబు తన అభిప్రాయాన్ని చెప్పడం, కనీసం టైం ఎంత అవుతుందో కూడా తెలీదు.. ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదంటూ అభిజిత్ హౌస్ లోని తమ కష్టాలను గురించి మొర పెట్టుకోవడం.. అలా సాగింది వీరి ముచ్చట్లు వ్యవహారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్