Krishna Vamsi And Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం వాళ్ళు చేసే సినిమాల మీదనే ముందుకు సాగుతోంది. పాన్ ఇండియాలో వాళ్ల సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసేలా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ లాంటి హీరో బాహుబలి సినిమాతో చాలా గొప్ప విజయాన్ని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విజయకేతనాన్ని ఎగరవేశాడు. ఇక ప్రస్తుతం ఆయన ఇండియాలో నెంబర్ వన్ హీరో కొనసాగుతున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…
ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న కృష్ణవంశీ ప్రభాస్ తో ‘చక్రం’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా విజయాన్ని సాధించకపోవడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో డిజాస్టర్ సినిమా వచ్చింది…కృష్ణవంశీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రభాస్ తో మరోసారి సినిమా చేయాలనుకుంటున్నారా అని కృష్ణవంశీ ని అడగారు.
ఆయన దానికి సమాధానం చెబుతూ ప్రస్తుతం ప్రభాస్ ఇమేజ్ కి ఉన్న ఇమేజ్ ను హ్యాండిల్ చేయలేనని చెప్పేసాడు. మొత్తానికైతే ఒకప్పుడు ‘చక్రం’ సినిమాతో భారీ ఫ్లాప్ ని అందించిన కృష్ణవంశీ ఇప్పుడు ప్రభాస్ ని హ్యాండిల్ చేయలేనని చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా కృష్ణవంశీ ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
గత రెండు సంవత్సరాల క్రితం రంగ మార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సంవత్సరం మరో సినిమాతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఒకప్పుడు సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన కృష్ణవంశీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలను చేయడం లేదు. అందుకే ఆయన సక్సెస్ లను సాధించడం లేదు…