Bigg Boss 9 Telugu Nominations: ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఆడియన్స్ వీకెండ్ ఎపిసోడ్స్ కంటే ఎక్కువగా సోమవారం రోజున జరిగే నామినేషన్స్ ప్రక్రియ మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే కంటెస్టెంట్స్ మధ్య వేరే లెవెల్ గొడవలు, వాదోపవాదనలు జరిగేది అప్పుడే కాబట్టి. ప్రతీ సీజన్ లోని మొదటి ఎపిసోడ్ లోనే నామినేషన్స్ ఉంటుంది. కానీ ఈసారి రెండవ రోజున పెట్టారు. మొదటి రోజు కంటెస్టెంట్స్ కి ఒకరిని ఒకరు నామినేట్ చేసుకునే పాయింట్స్ దొరికేలా బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) అనేక సందర్భాలు క్రియేట్ చేసాడు. ఇప్పుడు కంటెస్టెంట్స్ కి నామినేషన్స్ చేసుకోవడానికి బోలెడన్ని పాయింట్స్ దొరికాయి. అందుకే ఈ ప్రక్రియ చాలా ఫైర్ వాతావరణం లో జరిగాయి. ఇందాక విడుదలైన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. అందరూ కలిసి సంజన ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ, ఆమె హౌస్ లో చేసిన ఓవర్ యాక్షన్ మామూలుది కాదు.
Also Read: లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ముందు ‘మౌళి’ నెల సంపాదన ఎంతో ఉండేదో తెలుసా..?
ఆమె ఒక్కరి కారణంగా 14 మంది హౌస్ మేట్స్ మూడ్ చెడిపోయింది. అందుకే అందరూ ఆమెని నామినేట్ చేశారు. అదే విధంగా ప్రోమో లో మాస్క్ మ్యాన్ హరీష్ సుమన్ శెట్టి ని కూడా నామినేట్ చేస్తాడు. మీరు అసలు యాక్టీవ్ గా లేరని, ఈ గేమ్ షో కి పూర్తిగా కనెక్షన్ పోయినట్టు ఉన్నారని అంటాడు. అప్పుడు సుమన్ శెట్టి హౌస్ లోకి వచ్చి కేవలం రెండు రోజులే కదా సార్ అయ్యింది అని అంటాడు. అప్పుడు మాస్క్ మ్యాన్ ‘మీలో ఆ ఎనర్జీ..జీల్ కనిపించడం లేదని అనిపించింది’ అని అంటాడు. దానికి సుమన్ శెట్టి సైలెంట్ అయిపోతాడు. సుమన్ గారు ఇంకా ఏమైనా మీ దగ్గర పాయింట్స్ ఉంటే చెప్పండి అని మాస్క్ మ్యాన్ హరీష్ అనగా, ఏమి లేవండి అని సుమన్ అంటాడు. అప్పుడు సంజన మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి అని అంటున్నాడు అని సుమన్ కి వివరిస్తుంది. అప్పుడు సుమన్ ‘తెలుసు అండీ..నాకు తెలుగు వచ్చు..వినపడింది’ అని అంటాడు.
సుమన్ శెట్టి సైలెంట్ గా ఇచ్చిన ఈ కౌంటర్ ఒక రేంజ్ లో పేలింది. నెటిజెన్స్ కూడా సుమన్ శెట్టి ని ఈ విషయం లో తెగ లేపుతున్నారు. చూస్తుంటే సంజన అన్ని యాంగిల్స్ లోను రాబోయే రోజుల్లో నెగిటివ్ అయ్యేలా కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే సంజన తో పాటు ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ జాబితా ని ఒకసారి చూద్దాం. ఫ్లోరా షైనీ, సంజన, ఇమ్మానుయేల్, తనూజ, శ్రేష్టి వర్మ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, డిమోన్ పవన్ మరియు రాము రాథోడ్. వీరిలో శ్రేష్టి వర్మ ఎలా నామినేషన్స్ లోకి వచ్చిందో అసలు అర్థం కావడం లేదు. ఇమ్మానుయేల్ తో కలిసి హౌస్ మొత్తం ఈమె గొడ్డు చాకిరి చేసింది. ఎవరితోనూ గొడవలు కూడా పెట్టుకోలేదు. అయినప్పటికి నామినేషన్స్ లిస్ట్ లో ఉందంటే అసలు ఏమి జరిగిందో ఈరోజు ఎపిసోడ్ ని చూస్తేనే అర్థం అవుతుంది.