Mouli Talks Monthly Income: ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లో అవకాశాలు సంపాదించాలంటే చాలా కష్టం గా ఉండేది. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా లో లేదు, టాలెంట్ ఉన్నవాళ్లు తమ టాలెంట్ ని చూపించుకోవడానికే సరైన వేదిక ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా లేదు, యూట్యూబ్,ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఎన్నో వేదికలు వచ్చేశాయి. డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ ఇలా ఏ ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నా వాటిని జనాలకు చూపించుకోవడానికే ఇవి వేదిక గా మారాయి. అలా చేసిన వీడియోస్ బాగా వైరల్ అవ్వడం, జనాల అభిమానాన్ని సొంతం చేసుకోవడం తో, దర్శక నిర్మాతలు పిలిచి మరీ సినిమా అవకాశాలు ఇస్తున్నారు. అలా వచ్చిన వాడే మౌళి(Mouli Talks). రీసెంట్ గానే ఇతను ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie) అనే చిత్రం తో ఎంత పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడో మన అందరికీ తెలిసిందే.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని చేరుకుంది. అయితే ఈ సినిమాకు ముందు మౌళి ఒక స్టాండప్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో వందల ఈవెంట్స్ లో ఇతను చేసిన స్టాండప్ కామెడీ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండేది. అలా పాపులరైన మౌళి, ‘మౌళి టాక్స్’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని అలరిస్తూ లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అలా వచ్చిన పాపులారిటీ తో ఆయన ’90s’ అనే వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో చేశాడు. ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే ఈటీవీ విన్ యాప్ ఇతన్ని హీరో గా పెట్టి ‘లిటిల్ హార్ట్స్’ అనే సినిమా చేశారు.
ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఇక మౌళి కి రాదేమో. ఇదంతా పక్కన పెడితే మౌళి ఈ చిత్రానికి ముందు నెలకు ఎంత సంపాదించేవాడు అంటూ సోషల్ మీడియా లో అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ పెద్ద హిట్ అయ్యింది కాబట్టి, మౌళి నెలకు 10 లక్షల రూపాయలకు పైగానే సంపాదించేవాడని, ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాడు కాబట్టి కోట్లు సంపాదించే రేంజ్ కి ఎదుగుతాడని అందరూ అంటున్నారు. సొంత టాలెంట్ తో ఇంత చిన్న వయస్సు లోనే లక్షలు సంపాదించే రేంజ్ కి ఎదిగిన మౌళి ని చూసి చాలా మంది ఎన్నో నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.