Bigg Boss 9 Telugu Bharani Shankar: తెలుగు బిగ్ బాస్ హిస్టరీ పై ఒక బుక్ రాస్తే,ఆ బుక్ లో కచ్చితంగా శివాజీ అనే చాప్టర్ కచ్చితంగా ఉంటుంది. ఆయన్ని పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు,నెగటివ్ గా తీసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ యాంగిల్ లో అయినా షోలో తనదైన మార్క్ మొదటి ఎపిసోడ్ నుండే వేసాడు. తానూ గెలిపించాలని ప్లాన్ చేసుకున్న వాళ్లనే గెలిపించాడు. ఇకపోతే రీసెంట్ గా మొదలైన ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) భరణి శంకర్(Bharani Shankar) మరో శివాజీ లాగా కాబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతని ఎంట్రీ నే చాలా విభిన్నంగా జరిగింది. చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకొని దాంతో పాటు హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతిస్తేనే నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను, లేదంటే ఇటు నుండి ఇటే ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడే ఆడియన్స్ కి ఆమ్మో ఇతను మామూలోడు కాదు అని అనిపించింది.
Also Read: లిటిల్ హార్ట్స్’ చిత్రానికి ముందు ‘మౌళి’ నెల సంపాదన ఎంతో ఉండేదో తెలుసా..?
ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత భరణి ప్రవర్తించే తీరు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది ఈ రెండు రోజుల్లో. హౌస్ కి పెద్ద మనిషి లాగా వ్యవహరిస్తూ, ప్రతీ విషయం లోను తన వాయిస్ ని లేపుతూ, ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా చాలా చక్కగా నడుచుకుంటున్నాడు. కంటెస్టెంట్స్ కూడా అతను చెప్పే మాటలకు విలువ ని ఇస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ కూడా ఇదే విధంగా వ్యవహరించే వాడు. నాగార్జున కూడా ప్రతీ వీకెండ్ లో శివాజీ ని సెకండ్ ఒపీనియన్ గా అడిగేవాడు. హౌస్ లో నిన్ను అందరూ పెద్ద వాడిలా చూస్తున్నారు, నీ మాట అందరూ వింటారు, ముఖ్యమైన విషయాల్లో చొరవ తీసుకో అని నాగార్జున అనేవాడు. ఇప్పుడు భరణి కి కూడా నాగార్జున అదే చెప్తాడేమో.
అయితే శివాజీ కేవలం పల్లవి ప్రశాంత్, యావర్ లకే ఎక్కువగా తన అభిమానం ని చూపించేవాడు. కానీ భరణి శంకర్ మాత్రం అందరి పట్ల చాలా సమానమైన భావం చూపిస్తున్నాడు. మొదటి రెండు ఎపిసోడ్స్ తోనే తానూ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది నిరూపించుకోవడమే కాకుండా, తనదైన ముద్ర ని వేసుకోగలిగాడు. కాబట్టి కచ్చితంగా ఈయన రాబోయే రోజుల్లో మరో శివాజీ అయ్యేట్టుగా, శివాజీ ని మించిన కంటెస్టెంట్ కూడా అయ్యేట్టుగా అనిపిస్తుంది. పైగా మెగా బ్రదర్ నాగబాబు సపోర్టు కూడా భరణి కి ఉండడం తో, మెగా ఫ్యాన్స్ మొత్తం ఆయనకు ఓట్లు వేసేలా అనిపిస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో భరణి శంకర్ ఇలాగే ఉంటాడా?, లేకపోతే తనలోని ఎవరికీ తెలియని షేడ్ బయటకు వస్తుందా అనేది. ఇదే విధంగా ఆయన ఆట తీరు ఉంటే మాత్రం కచ్చితంగా టాప్ 5 లిస్ట్ లో ఉంటాడు అనొచ్చు.