Bigg Boss 9 Telugu Day 53: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) లో ఏదేదో జరిగిపోతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు, ఈ సీజన్ లో చాలా ఎక్కువ అయిపోయాయి. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో గత రెండు వారాల్లో ఎలిమినేట్ అయినటువంటి శ్రీజ, భరణి వంటి వారు రీ ఎంట్రీ ఇవ్వడం, భరణి టాస్కులన్నీ గెలవడం మాత్రమే కాకుండా, ఆడియన్స్ ఓటింగ్ లో కూడా టాప్ లో ఉండడం తో ఆయన శాశ్వత హౌస్ మేట్ గా నిలిచి, శ్రీజ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ని నేడు టెలికాస్ట్ చేస్తారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి దివ్వెల మాధురి, రాము రాథోడ్, తనూజ, రీతూ చౌదరి, డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్, గౌరవ్, సంజన నామినేట్ అయ్యారు. వీరిలో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చెప్పడం చాలా కష్టంగా మారింది.
Also Read: సెంచరీ కొట్టినా నో సెలబ్రేషన్స్.. గెలిచేదాకా పోరాటం.. జెమీమా పట్టుదలకు సలాం
ఎందుకంటే తనూజ, పవన్ కళ్యాణ్, సంజన తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళ మధ్య ఓటింగ్ తేడా కూడా చాలా తక్కువగా ఉంది. వెబ్ సైట్ పోల్స్ ప్రకారం చూస్తే మాధురి కి ఎంత ఓటింగ్ అయితే పడిందో, రీతూ చౌదరి, డిమోన్ పవన్, రాము, గౌరవ్ లకు కూడా అంతే ఓటింగ్ పడింది. కానీ యూట్యూబ్ పోల్స్ లో మాత్రం మాధురి కి అందరి కంటే తక్కువ ఓటింగ్ పడింది. ఒక్కటైతే నిజం, ఎలిమినేషన్ రౌండ్ లోకి మాధురి మాత్రం కచ్చితంగా వస్తుంది. ఆమెతో పాటు ఎవరు డేంజర్ జోన్ లోకి వస్తారు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఎలిమినేషన్ రౌండ్ లో మాధురి తో పాటు గౌరవ్ ఉంటే మాత్రం మాధురి కచ్చితంగా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే తనూజ చేతుల్లో సేవింగ్ పవర్ ఉంది.
మాధురి తో ఆమెకు మొదటి నుండి మంచి స్నేహం ఉంది, అదే సమయం లో గౌరవ్ కి తనూజ కి మధ్య ఎలాంటి బాండింగ్ లేదు, వీళ్లిద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు కూడా మనం ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ ఎలిమినేషన్ రౌండ్ లోకి మాధురి మరియు రీతూ చౌదరి, లేదా డిమోన్ పవన్ వంటి వారు వస్తే, తనూజ ఎవరి కోసం ఉపయోగిస్తుంది అనేది మరో ఆసక్తికరమైన అంశం. టాస్కులను బట్టీ, మొదటి వారం నుండి తనతో ఉన్న బాండింగ్ ని బట్టీ చూస్తే ఆమె న్యాయం గా రీతూ చౌదరి లేదా డిమోన్ పవన్ ని సేవ్ చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే తనూజ కి సోషల్ మీడియా లో నెగిటివిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ వారం ఏమి జరగబోతుంది అనేది.