Minister Sridhar Babu: ఆశ పడవచ్చు. కానీ ఆ ఆశకు హద్దు ఉండాలి.. అర్హత ఉండాలి. దానిని సాధించాలి అన్న తపన ఉండాలి. కష్టపడాలి. అందరినీ కలుపుకుపోవాలి. రాజకీయాల్లో నేతలకు ఆశలు ఎక్కువ. పదవీ వ్యామోహంతోపాటు, సంపాదించాలి.. కీలక పదవులు అలంకరించాలని ఆశపడతుంటారు. చాలా మందికి అవి నెరవేరవు. కొందరికి అదృష్టంతో కలిసి వస్తాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు చూస్తే మాత్రం అత్యాశే అనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన చాలా హామీలు నెరవేర్చలేదు. ఇక హైడ్రా, ధాన్యానికి బోనస్, పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500 సాయం, విద్యార్థినులకు స్కూటీలు వంటివి అమలుకు నోచుకోలేదు. హైడ్రా హైదరాబాద్ వాసులను దెబ్బతీస్తోంది. ఇలాంటి తరుణంలో హస్తం నేతలు తాము రాబోయే 30 ఏళ్లు అధికారంలో ఉంటామని వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది. మొన్నటి వరకు రేవంత్‌రెడ్డి పదేళ్లు నేనే సీఎం అని ప్రకటించారు. ఇప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు 30 ఏళ్లు తమదే అధికారం అని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి గురించి ‘మీడియాలోనే తెలిసింది, నాకు అధికారిక సమాచారం లేదు‘ అని చెప్పడం పార్టీలో అంతర్గత విభేదాలకు నిదర్శనం.
Also Read: సెంచరీ కొట్టినా నో సెలబ్రేషన్స్.. గెలిచేదాకా పోరాటం.. జెమీమా పట్టుదలకు సలాం
ఆశా.. అత్యాశా..?
శ్రీధర్ బాబు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత, పార్టీ ’రైజింగ్ తెలంగాణ’ విజన్‌తో ముందుకు సాగుతోంది. ఆరు హామీల అమలు, ఉద్యోగ నియామకాలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి చర్యలు ప్రజల్లో బలం పెంచాయి. అయితే 30 ఏళ్లు అధికారం అత్యాశే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ బలపడటం, బీఆర్‌ఎస్ పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హామీలు నెరవర్చేకపోవడం పెద్ద మైనస్.
బలమా, బలహీనతమా?
కాంగ్రెస్‌లో మంత్రులు బహిరంగంగా వ్యాఖలు వివాదాస్పదమవుతున్నాయి. దీనిపై శ్రీధర్‌బాబు స్పందిస్తూ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని పేర్కొన్నారు. ఇది ఒకవైపు సానుకూలం.. మరోవైపు బలహీనత కూడా. కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు. ఒకరి ఎదుగుదలను మరొకరు ఓర్వలేనంత ప్రజాస్వామ్యం. ఇలాంటి పార్టీ ప్రజలను ఆకట్టుకుని 30 ఏళ్లు అధికారంలో ఉండడం అంత ఈజీ కాదు.
సవాళ్లు.. అవకాశాలు..
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అంతర్గత విభేదాలు, విపక్షాల పునరుజ్జీవనం, ఆర్థిక సమస్యలు. బీఆర్‌ఎస్ యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ జాతీయ అంశాలతో బలపడుతోంది. అయితే, యువత ఉద్యోగాలు, మహిళల సాధికారత, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వంటివి పార్టీని బలపరుస్తాయి. శ్రీధర్ బాబు వంటి నాయకులు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ, ఏకత్వాన్ని కాపాడితే, ఈ కల సాధ్యం కావొచ్చు. కానీ రాజకీయ చరిత్ర చూస్తే, దీర్ఘకాలిక ఆధిపత్యం పాలసీలపై ఆధారపడి ఉంటుంది, వ్యక్తిగత వ్యాఖ్యలపై కాదు.
శ్రీధర్ బాబు వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని ధైర్యాన్ని చూపిస్తున్నాయి, కానీ అవి పరీక్షల సూచనలు కూడా. 30 ఏళ్లు ఆధిపత్యం కలలు కాకుండా నిజమవ్వాలంటే, అంతర్గత ఏకత్వం, పారదర్శకత, ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టాలి. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటారు – కాంగ్రెస్ దాన్ని అందిస్తే, ఈ కల నిజమవుతుంది. లేకపోతే, రాజకీయాల్లో ఆర్పు తప్పదు.
తెలంగాణలో మరో 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది
మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి మంత్రులు బహిరంగంగా విమర్శలు చేసుకుంటారు
అజారుద్దీన్ మంత్రి పదవి గురించి మీడియాలోనే చూసాను.. నాకు సమాచారం లేదు – మంత్రి శ్రీధర్ బాబు
Video Credits – Tv9 pic.twitter.com/YOCteweN4U
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025