Chittoor Mayor Couple Case: సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతులు దారుణంగా హ** కు గురయ్యారు. ఈ కేసు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సంఘటన కలకలం సృష్టించడంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హోం శాఖకు కీలక ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు దిగాయి. విచారణ చేపట్టిన పోలీసులు ఆ ఘటనలో ఐదుగురి ప్రమేయం ఉందని తేల్చారు..
Also Read: సెంచరీ కొట్టినా నో సెలబ్రేషన్స్.. గెలిచేదాకా పోరాటం.. జెమీమా పట్టుదలకు సలాం
ఇక నాటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చిత్తూరు ఆరో అదనప జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు గడిచిన శుక్రవారం కీలకమైన తీర్పు ఇచ్చారు. వారికి 31 తారీఖున శిక్ష ఖరారు చేస్తామని చెప్పారు. వాస్తవానికి 27వ తేదీన శిక్ష ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాలవల్ల అది నాలుగు రోజులకు వాయిదా పడింది. ఇక ఈ కేసులో ముందుగా 23 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఇందులో కాసరం రమేష్ (ఏ 22) అనే వ్యక్తి తనకు ఈ సంఘటనతో ఎటువంటి ప్రమాదం లేదని కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో వాదనలు విన్న న్యాయస్థానం అతడిని తప్పించింది. శ్రీనివాస చారి (ఏ 21) ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో 21 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇందులో శ్రీరామచంద్రశేఖర్ ఆలియాస్ చింటూ (ఏ1), వెంకటేష్ అలియాస్ గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి (ఏ2), జయా రెడ్డి అలియాస్ జయప్రకాశ్ రెడ్డి (ఏ 3), మంజు అలియాస్ మంజునాథ్ (ఏ4), మునిరత్నం వెంకటేష్ (ఏ 5) ను పోలీసులు దోషులుగా తేల్చారు.
మేయర్ దంపతులను అంతం చేసే క్రమంలో వారి పక్కనే ఉన్న వేలూరి సతీష్ కుమార్ నాయుడు అనే వ్యక్తిని అంతం చేయడానికి మంజునాథ్ (ఏ 4) ప్రయత్నించాడు. అయితే సతీష్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకోవడంతో మంజునాథ్ మీద హత్యాయత్నం కేసు నమోదయింది. ఇక ఈ కేసులో కూడా నిజాలను నిరూపించడంలో పోలీసులు విజయవంతమయ్యారు.. ఈ కేసులో అవయవాలు ఎదుర్కొంటున్న వారికి ఆయుధాలను సమకూర్చడం.. ఆశ్రయం కూడా ఇవ్వడం.. డబ్బులు సహాయం చేసిన 16 మందిపై పోలీసులు అభియోగాలు మోపారు. అయితే విచారణలో వాటిని నిరూపించలేకపోయారు. దీంతో వరద నిర్దోషలుగా బయటికి వచ్చారు. ఇక ఈ కేసులో 10 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిన తర్వాత అనురాధ కుటుంబ సభ్యులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడడం విశేషం. అంతేకాదు 122 మంది సాక్షులను న్యాస్థానం విచారించింది.. ఇక ఈ కేసులో ఏ 3, ఏ 4 జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్ గడిచిన 10 సంవత్సరాలుగా జైల్లోనే ఉంటున్నారు.
కటారి అనురాధ భర్త మోహన్ టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు, మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ ఆలియాస్ చింటూ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ ను అటు లేకుండా చూసుకోవాలని చింటూ భావించాడు. 2017 నవంబర్ 17న చింటూ తో పాటు నలుగురు వ్యక్తులు బురకాలు ధరించారు. ఆయుధాలు చేత పట్టుకొని చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించి అనురాధ, మోహన్ పై దారుణంగా దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. కటారి మోహన్ ను ఏకంగా కత్తులతో నరికారు. అయితే మోహన్ కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతూ వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు..