Bigg Boss 9 Telugu Dammu Srija : ‘అగ్నిపరీక్ష’ షోలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న దమ్ము శ్రీజా(Dammu Srija), బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి వచ్చాక ఎందుకో ఆ రేంజ్ జోరు చూపించలేకపోతుంది. ‘అగ్నిపరీక్ష’ షోస్ లో ఈమె పెట్టే పాయింట్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండేది. కానీ బిగ్ బాస్ షో లో మాత్రం ఆమె ఎంత సిల్లీ పాయింట్స్ నామినేషన్స్ సమయం లో తనూజ పైన పెట్టిందో శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వీడియో వేసి మరీ చూపించాడు. దీంతో ఆమెకు నోటి నుండి మాట రాలేదు. మీ ఓనర్స్ చేసిన తప్పుకి తనూజ ని నామినేట్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదంటూ శ్రీజా ని నిలదీసాడు నాగార్జున. అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఆమె నాగార్జున కి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా చూసే ఆడియన్స్ కి అర్థమైంది. దీనిని గమనించిన ఆడియన్స్ కి ఎందుకు ఈమెకు ఇంత బలుపు అని మండిపడుతున్నారు.
ముందుగా నాగార్జున మాట్లాడుతూ ‘హౌస్ లో ఇంకా ఎవరికైనా సమస్యలు ఉన్నాయా?’ అని అడుగుతాడు. అప్పుడు శ్రీజ చెయ్యి పైకి లేపుతుంది. దానికి నాగార్జున కౌంటర్ ఇస్తూ ‘శ్రీజా నే అందరికి సమస్య. అలాంటి శ్రీజకు సమస్యలు ఉన్నాయా’ అని సెటైర్లు వేస్తాడు. దానికి శ్రీజ సమాధానం చెప్తూ ‘మొదటి సమస్య ఏమిటంటే సార్, నా వాయిస్ హై పిచ్ కి వెళ్తే జనాలకు చిరాకు వెయ్యొచ్చు కానీ, అది నా ఒరిజినల్ వాయిస్ సార్. దానిని అయితే నేను మార్చుకోలేను సార్’ అని అంటుంది. అప్పుడు నాగార్జున ‘అయ్యో అది మా సమస్య అమ్మా..నీకు కాదు’ అని అంటాడు. అప్పుడు శ్రీజ ‘అదే చెప్తున్నాను సార్..నాదైతే సమస్య కాదు సార్ అది’ అని అంటుంది. ఇక్కడ ఆమె నిర్మొహమాటంగా నాతో సమస్య ఉంది అని అనొద్దు అంటూ నాగార్జున కి పరోక్షంగా చెప్పినట్టుగా అనిపించింది.
నాగార్జున సరదాగా అందరి మీద జోకులు వేస్తుంటాడు, దానిని అందరూ చాలా సరదాగా తీసుకుంటారు, కానీ మొట్టమొదటిసారి నాగార్జున నే ఈమె తప్పుబట్టింది, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మనతో మాట్లాడమే ఒక కల లాంటిది, అలాంటిది ఆయన తన తోటి స్నేహితులతో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడుతూ సరదాగా జోకులు వేస్తె తీసుకోలేరా?,నువ్వు ఏమైనా పైన నుండి దిగి వచ్చావా అంటూ నెటిజెన్స్ శ్రీజ పై మండిపడుతున్నారు. ఏది ఏమైనా శ్రీజ గ్రాఫ్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత బాగా పడిపోయింది. ముఖ్యంగా ఈ వీకెండ్ ఎపిసోడ్ తో ఆమె గ్రాఫ్ మరింతగా పడిపోయింది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.