Bigg Boss 9 Telugu Updates: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో మొదలై అప్పుడే రెండు వారాలు పూర్తి అయ్యింది. ఈ రెండు వారాల్లో శ్రేష్టి వర్మ మరియు మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం జరిగిన నామినేషన్స్ లో ప్రక్రియ లో రీతూ చౌదరి, పవన్ కళ్యాణ్, ఫ్లోరా షైనీ, మాస్క్ మ్యాన్ హరీష్ , రాము రాథోడ్ , ప్రియా వంటి వారు ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. వీరిలో కచ్చితంగా ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే అందరికనే టాప్ ఓటింగ్ తో ఫ్లోరా షైనీ కొనసాగుతుంది. మిగిలిన వారిలో రాము రాథోడ్ కి మంచి ఓటింగ్ పడుతుంది. వీళ్లిద్దరి ప్రస్తుతం టాప్ 2 లో ఉన్నారు. మిగిలిన నలుగురు దాదాపుగా సమానమైన ఓటింగ్ తో డేంజర్ జోన్ లోనే ఉన్నారు.
వారిలో సింగిల్ ఎలిమినేషన్ పెడితే ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ డబుల్ ఎలిమినేషన్ పడితే ప్రియా తో పాటు రీతూ చౌదరి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మిడ్ వీక్ లో అగ్నిపరీక్ష సామాన్యుల్లో ఒకరు హౌస్ లోపలకు అడుగుపెట్టబోతున్నారు కాబట్టి కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రియా ద్వారా బోలెడంత కంటెంట్ వస్తుంది కాబట్టి , ఆమెని హౌస్ లోనే ఉంచి పవన్ కళ్యాణ్ మరియు రీతూ చౌదరి లను ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన లో కూడా ఉన్నారట. అగ్ని పరీక్ష షో లో పవన్ కళ్యాణ్ ని చూసి కచ్చితంగా టైటిల్ రేస్ లోకి అడుగుపెడతాడు అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి కంటెంట్ రావడం లేదు.
Also Read: ‘బిగ్ బాస్ 9’ నుండి రీతూ చౌదరి అవుట్..అర్థరాత్రి ఊహించని ట్విస్ట్!
హౌస్ మేట్స్ అందరితో బోరింగ్ అని అనిపించుకున్న ఫ్లోరా షైనీ నుండి కూడా ఎదో ఒక కంటెంట్ వచ్చింది. అగ్నిపరీక్ష షో లో పెద్దగా ఆకట్టుకోని డిమోన్ పవన్ నుండి కూడా చాలా కంటెంట్ వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ నుండి మాత్రం రావడం లేదు. అందుకే ఆయన్ని తొలగించాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి. అసలు ఎలాంటి ఆట ఆడకుండా, సైలెంట్ కిల్లర్ లాగ ఫ్లోరా షైనీ ఇన్ని వారాలు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చూస్తుంటే కామనర్స్ మొత్తం ఎలిమినేట్ అయ్యే వరకు ఈమె హౌస్ లోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు.