Bigg Boss 9 Telugu Wild Card Contestants: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) చాలా ఆసక్తికరంగా ముందుకు దూసుకుపోతుంది. కానీ ఈ సీజన్ లో వచ్చిన సమస్య ఏమిటంటే, ఏ ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య కూడా వ్యక్తిగత ఫైటింగ్ కొనసాగుతూ ముందుకు వెళ్లకపోవడమే. గత సీజన్ లో నిఖిల్ మరియు గౌతమ్ మధ్య ఎలాంటి మాటలు యుద్ధం నడిచిందో, అది చివరి వారం వరకు ఎలా కొనసాగిందో మన కళ్లారా చూసాము. అలా కొనసాగడం వల్లే ఫ్లాప్ అంచుల్లో ఉన్న సీజన్ 8 యావరేజ్ గా అయినా నిల్చింది. కానీ ఈ సీజన్ లో అలాంటి ఫైటింగ్స్ లేవు. గొడవలు పడుతున్నారు కానీ, వెంటనే కలిసిపోతున్నారు. ఈ ఒక్క అంశం టీఆర్ఫీ రేటింగ్స్ మీద కాస్త ప్రభావం చూపిస్తుందట. అందుకే ఈసారి ఫైర్ స్ట్రోమ్ రాబోతుంది అంటూ ఫైర్ మీదున్న వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని రేపటి ఎపిసోడ్ ద్వారా లోపలకు పంపబోతున్నారట. మొత్తం మీద 6 మంది హౌస్ లోకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఆ ఆరు మంది ఎవరు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
హౌస్ లోకి వైల్డ్ కార్డు గా నేడు అడుగుపెట్టబోతున్న మొదటి కంటెస్టెంట్ ఆయేషా. ఈమె ఒక టాప్ సీరియల్ హీరోయిన్. గత ఏడాది స్టార్ మా ఛానల్ లో ఈమె బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్ తో కలిసి ‘ఊర్వశివో..రాక్షసివో’ అనే సీరియల్ లో నటించిందట. అంతే కాదు, ఈమె తమిళ బిగ్ బాస్ లో నెల రోజుల పాటు కొనసాగింది అట. గొడవలు పడడం లో దిట్ట, అబ్బాయిలతో సమానంగా గేమ్స్ ఆడుతుంది, చూసేందుకు చాలా అందంగా కూడా ఉంటుంది. ఇక హౌస్ లోకి అడుగుపెడుతున్న రెండవ కంటెస్టెంట్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య. సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు ఇది. పికిల్స్ వ్యాపారం లో ఉన్నత స్థాయికి వెళ్లిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు లో ఒకరు రమ్య. రీసెంట్ గానే ఈమె ఒక కస్టమర్ ని బూతులు తిట్టడం, దానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియా లో లీకై వైరల్ అవ్వడం, తీవ్రమైన నెగిటివిటీ ని ఎదురుకోవడం వంటివి జరిగాయి.
చూసేందుకు సినిమా హీరోయిన్ లాగా అనిపించే రమ్య, ఇన్ స్టాగ్రామ్ లో తన అందాన్ని ఆరబోస్తూ ఎన్నో వీడియోలు కూడా చేసింది. గొడవలు పడడంలో ముందు ఉండే రమ్య, హౌస్ లోకి వచ్చిన తర్వాత ఏ రేంజ్ ఫైర్ చూపిస్తుందో చూడాలి. ఇక హౌస్ లోకి అడుగుపెట్టే మూడవ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ దివ్వెల మాధురి. ఈమెది కూడా పరిచయం అక్కర్లేని పేరు. శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి గా సోషల్ మీడియా లో ఒక రేంజ్ పాపులారిటీ ని సంపాదించింది ఈమె. ఇప్పుడు హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఎలా ఆడబోతుందో చూడాలి. అదే విధంగా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న నాల్గవ కంటెస్టెంట్ నిఖిల్ నాయర్. ఇతను గతం లో గృహలక్ష్మి సీరియల్ లో నటించాడు. ఆ తర్వాత అదే స్టార్ మా ఛానల్ లో పలుకే బంగారమాయే అనే సీరియల్ లో హీరో గా నటించాడు. ఈయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ లో ఒకరు శ్రీనివాస్ సాయి, మరొకరు గౌరవ్ గుప్తా. శ్రీనివాస్ సాయి గతం లో గోల్కొండ హై స్కూల్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు, పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసాడు. ఇక గౌరవ్ గుప్తా విషయానికి వస్తే ఈయన స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే గీత LLB అనే సీరియల్ లో హీరో గా నటించాడు. ఈ ఆరు మంది వైల్డ్ కార్డ్స్ ని బిగ్ బాస్ టీం ఫైర్ స్ట్రోమ్ అని సంబోధిస్తుంది, చూడాలి మరి వీళ్ళు ఎంత ఫైర్ ని హౌస్ లో పుట్టిస్తారు అనేది.