Bigg Boss 9 Telugu Bharani Eliminated: ఈ సీజన్(Bigg Boss 9 Telugu) లో ఆడియన్స్ ని బాగా బాగా బాధకు గురి చేసిన ఎలిమినేషన్ ఏదైనా ఉందా అంటే అది భరణి దే. హౌస్ లో మంచి వాడిగా పేరు తెచ్చుకున్నాడు, టాస్కులు బాగా ఆడాడు, కానీ బంధాలలో చిక్కుకొని, తన ఆట ని మొత్తం పాడు చేసుకొని బయటకు వచేసాడు. బంధాల కారణంగా నా గేమ్ ఎఫెక్ట్ అవ్వలేదని భరణి మొన్న చెప్పుకొచ్చాడు, కానీ అది ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చెప్పలేకపోయాడు, ఇది కచ్చితంగా ఆయన పొరపాటే అని అనుకోవాలి. ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చెప్పడం కూడా ఆయన గేమ్ లో భాగమే కదా, అక్కడ విఫలం అయ్యాడు భరణి. బంధాల వల్ల భరణి గేమ్ పై ప్రభావం పడింది అని కూడా చెప్పలేము, తనూజ తో ఉన్నన్ని రోజులు ఆయన ఆట పై ఇసుమంత ప్రభావం కూడా పడలేదు.
కానీ ఎప్పుడైతే దివ్య ఎంట్రీ ఇచ్చిందో, అప్పటి నుండే భరణి గేమ్ పై ప్రభావం పడింది. ఆమె లోపలకు వచ్చిన వెంటనే, భరణి ని మొదటి స్థానం లో నిలబెట్టడం, అది చూసి బయట తనకు నెంబర్ 1 స్థాయిలో ఓటింగ్ పడుతుందని భరణి భ్రమ పడడం, తనకు పీక్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి, తన ఆట ని చూపించుకోవడం కంటే, తనని నమ్ముకున్న వాళ్ళని పైకి తీసుకొని రావడం లోనే భరణి ఎక్కువగా శ్రద్ద చూపించడం వల్ల, ఆయన సొంత గేమ్ పూర్తిగా గాడి తప్పింది. భరణి చివరికి ఎలాంటి ట్రామాలోకి వెళ్లిపోయాడంటే, తనని నామినేట్ చేసిన ప్రతీ ఒక్కరిని జనాలు బయటకి పంపేస్తున్నారని, తానూ సింహం లాంటి వాడిని అనే రేంజ్ కి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో భరణి ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయాడు.
ఇక ఈ వారం లో అయితే ఆయన నుండి కంటెంట్ కూడా పెద్దగా రాలేదు. టాస్కులలో హైలైట్ అవ్వలేదు, హౌస్ లో ఎవరితోనూ గొడవలు పడలేదు, వీటి అన్నిటి కారణంగా భరణి ఎలివేట్ కాకపోవడం తో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా దివ్య ఈయన చుట్టూనే తిరుగుతూ ఉండడం, ఒక్క క్షణం కూడా వదిలి పెట్టకపోవడం తో, తనూజ కి కూడా దివ్య వచ్చిన తర్వాత భరణి తనని పూర్తిగా దూరం పెట్టాడు అనే ఫీలింగ్ కలిగింది. పదే పదే ఆమె ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ భరణి పై ఆడియన్స్ లో చెడ్డ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. నిజంగానే మంచి మనిషి అయినప్పటికీ, మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడు, ఫేక్ మనిషి అంటూ సోషల్ మీడియా లో ఇతర కంటెస్టెంట్స్ కి సంబంధించిన పీఆర్ రుద్దడం లో సక్సెస్ అయ్యింది. అన్ని కలిసొచ్చి, టాప్ 5 లో నిలబడే సత్తా ఉన్న కంటెస్టెంట్,కేవలం 5 వారాలకే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.