Samantha: ఈమధ్య కాలం లో సమంత(Samantha Ruth Prabhu) సినిమాలు బాగా తగ్గించేసింది. అందుకు కారణం ఆమె ఆరోగ్య సమస్యలే అని పలు ఇంటర్వ్యూస్ లో స్వయంగా చెప్పుకొచ్చింది. ఆమె చివరి సారిగా వెండితెర పై హీరోయిన్ గా కనిపించిన చిత్రం ఖుషి. ఆ తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు సంతకం చెయ్యలేదు. ఈ ఏడాది నిర్మాతగా శుభం అనే చిత్రం చేసి సక్సెస్ ని అందుకుంది. ఇందులో చిన్న క్యారక్టర్ కూడా చేసింది. కానీ సమంత ని మాత్రం ఆమె అభిమానులు వెండితెర పై బాగా మిస్ అవుతున్నారు. ఆమె తదుపరి చిత్రం ఏమిటి అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. తన సొంత నిర్మాణ సంస్థ లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని ప్రకటించి చాలా కాలమే అయ్యింది. ఇందులో ఆమెనే లీడ్ రోల్ చేసింది. కానీ ఈ సినిమా ప్రోగ్రెస్ ఏంటో ఎవరికీ తెలియదు.
అసలు షూటింగ్ జరుగుతుందా, లేదా మధ్యలోనే ఆగిపోయిందా అనే క్లారిటీ కూడా లేదు. ఇన్ స్టాగ్రామ్ లో హెల్త్ సంబంధించిన ప్రొమోషన్స్ లోనే ఈమధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అది కాకుండా తన కాబోయే భర్త రాజ్ నిడిమోరు తో కలిసి ట్రిప్పులకు వెళ్తుంది. అంతకు మించి సమంత నుండి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. నాగ చైతన్య తో విడాకులు తర్వాత సొంత కాళ్ళ మీద నిలబడి పాన్ ఇండియన్ మార్కెట్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అనుకుంటే, ఎటు కాకుండా పోయిందని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె NDTV వరల్డ్ మినిట్ సమ్మిట్ లో పాల్గొన్నది. ఈ కార్యక్రమం లో తన కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ నా జీవితం ఒక తెరిచినా పుస్తకం లాంటిది, జనాలందరికీ తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.
నాగ చైతన్య తో విడాకులు జరిగిన తర్వాత ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నదని, అలాంటి సమయం లో కూడా తనపై ఎన్నో విమర్శలు వచ్చాయని, సోషల్ మీడియా లో అయితే కొంతమంది అలా ఉండబట్టే నీకు ఇలా జరిగింది అంటూ ఎవరికీ తోచిన తీర్పులు వాళ్ళు ఇచ్చేశారని చెప్పుకొచ్చింది సమంత. నా జీవితం లో జరిగే కొన్ని విషయాలకు నేను కూడా సమాధానం చెప్పలేను. నేను పూర్తిగా తప్పు చేయని మనిషిని అని ఎప్పుడూ చెప్పుకోను, నేను కూడా కొన్ని పొరపాట్లను చేశా. పుష్ప చిత్రం లో ఐటెం సాంగ్ చేసినందుకు కొందరు నన్ను విమర్శించారు. కానీ సెల్ఫ్ ఛాలెంజింగ్ కోసం, తానూ ఎలాంటి పాత్రలు అయినా చెయ్యగలను అని చెప్పడానికే ఆ పాటని చేశాను. అక్కడితో దాని చాప్టర్ క్లోజ్ అయ్యింది,మళ్లీ ఐటమ్స్ సాంగ్స్ చెయ్యను అంటూ చెప్పుకొచ్చింది సమంత.