Bigg Boss 9 Telugu Suman Shetty: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ఎదురుగా ఎవరున్నా డామినేషన్ తో మాట్లాడే ప్రయత్నం చేసే కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రియ,శ్రీజ మాత్రమే. వీళ్ళ నోర్లను మూయించడం హోస్ట్ నాగార్జున వల్లనే అవ్వడం లేదు, అలాంటిది సుమన్ శెట్టి నిన్న ఒకే ఒక్క పంచ్ తో ప్రియ నోరు మూయించాడు. ఆయన వేసిన కౌంటర్ కి ఆడియన్స్ గ్యాలరీ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే రెండు సార్లు ఆమె కారణంగా సుమన్ శెట్టి నష్టపోయాడు. కెప్టెన్సీ టాస్క్ లో భాగమైన కాలచక్రం టాస్క్ లో సుమన్ శెట్టి కి అన్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్ రూల్స్ ని అతిక్రమిస్తూ సుమన్ శెట్టి ని గేమ్ నుండి బయటకు తోసే ప్రయత్నం చేసాడు. కానీ సంచాలక్ గా ఉన్న ప్రియ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సుమన్ శెట్టి గేమ్ నుండి అవుట్ అయ్యాడు.
కేవలం కెప్టెన్సీ టాస్క్ లోనే కాదు, ఓనర్ టాస్క్ లో కూడా సుమన్ శెట్టి కి అన్యాయం జరిగింది. ఈ టాస్క్ లో తన వైపు వస్తున్న సంజన, ఫ్లోరా షైనీ ని కొట్టే ప్రయత్నం చేసాడు సుమన్ శెట్టి. ఒకసారి పొరపాటున ఫ్లోరా షైనీ కి ఆయన చెయ్యి చాలా బలంగా తగులుతుంది కూడా. అప్పుడు ప్రియ ఇంకోసారి కొడితే అవుట్ అన్నా అని అంటుంది. అప్పుడు సుమన్ శెట్టి సంజన తన బాస్కెట్ లో ఉన్న బొమ్మలు తీసుకోవడానికి వచ్చినప్పుడు, దాని కవర్ చేస్తూ పెట్టిన తన టీ షర్ట్ ని తీసేందుకు సంజన ప్రయత్నం చేస్తే టీ షర్ట్ పై కొడుతాడు సుమన్ శెట్టి. ఇది ప్రియ కి సంజన ని కొట్టినట్టు అనిపించి సుమన్ ని టాస్క్ నుండి తప్పిస్తుంది. కానీ కొట్టింది టీ షర్ట్ నే అని నాగార్జున స్పష్టంగా వీడియో వేసి చూపిస్తాడు.
దీంతో తన తప్పు తెలుసుకున్న ప్రియ సుమన్ శెట్టి కి క్షమాపణలు చెప్తుంది. అందుకు సుమన్ శెట్టి కౌంటర్ ఇస్తూ ‘ఇప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పడం వల్ల నేను ఓనర్ ని అవ్వలేను కదమ్మా, నాకు ఓనర్ తిరిగి వస్తే కచ్చితంగా నీ క్షమాపణలు అంగీకరిస్తాను’ అని కౌంటర్ ఇస్తాడు సుమన్. దీంతో ప్రియ శెట్టి దెబ్బకు నోరు మూసేస్తుంది. హౌస్ లో సంజన కి అయినా, ప్రియ, శ్రీజ లాంటోళ్లకు అయినా, ఒకే ఒక్క దెబ్బతో నోటి నుండి మాట రానివ్వకుండా చెయ్యాలంటే ఒక్క సుమన్ శెట్టి వల్లే సాధ్యమని నిన్నటి ఎపిసోడ్ తో మరోసారి రుజువు అయ్యింది.