Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ ఎంతటి ఆసక్తికరమైన వాతావరణం మధ్య జరుగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి ఎపిసోడ్ నుండే ఈ సీజన్ లో గొడవలు బలంగా మొదలయ్యాయి. అలా మొదలైన గొడవలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అందరిలో సుమన్ శెట్టి మాటలు మాట్లాడడం లో కానీ, టాస్కులు ఆడడంలో కానీ చాలా వీక్ గా ఉన్నాడని అంతా అనుకునే వారు. కానీ గత వారం ఏమి చేయకపోయినా కూడా ఆడియన్స్ ఆయనకు రికార్డు స్థాయిలో ఓటింగ్ వేసి గెలిపించడం తో,వాళ్ళ కోసం కచ్చితంగా గేమ్స్ ఆడాలి, అందరితో కలిసి పోవాలి అని మనసులో బలంగా అనుకున్నట్టు ఉన్నాడు. అందుకే ఈమధ్య టాస్కులు ఇరగదీస్తున్నాడు. నామినేషన్స్ సమయం లో చాలా బలంగా తాను గొంతుని వినిపిస్తున్నాడు. ఏ రేంజ్ లో అనేది ఈ వారం నామినేషన్స్ లో మనమంతా చూసాము. ఈ వారం ఆయన నామినేషన్స్ లో కూడా ఉన్నాడు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుమన్ శెట్టి అందరి కంటే టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్నాడు. అది కాసేపు పక్కన పెడితే నేడు బిగ్ బాస్ హౌస్ లో పర్మనంట్ ఓనర్ టాస్క్ ని నిర్వహించారు. అంటే ప్రస్తుతం ఉన్న టెనెంట్స్ లో లో ఒకరికి శాశ్వతంగా మెయిన్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం వస్తుంది అన్నమాట. ఇప్పటికే భరణి అలాంటి టాస్క్ గెలిచి మెయిన్ హౌస్ లోకి మొట్టమొదటి శాశ్వత ఓనర్ గా నిలిచాడు. అయితే టాస్క్ ఏమిటంటే ఓనర్స్ గా ఉన్నవాళ్లు కొన్ని వస్తువులను టెనెంట్స్ పై విసురుతూ ఉంటారు. వాటిని టెనెంట్స్ పట్టుకొని ఒక బాస్కెట్ లో వేసుకోవాలి. వేసుకోవడమే కాదు వాటిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. అంటే ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ నుండి బలవంతంగా లాక్కోవచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన ప్రోమో ఇందాకే విడుదలైంది.
రీతూ చౌదరి ఈ ఆటలో రెచ్చిపోయి మరీ ఆడుతుంది. సంజన మీద తనకు మొదటి నుండి ఉన్న కోపాన్ని మొత్తం చూపిస్తూ, ఆమె బాస్కెట్ పై పడింది. ఆ తర్వాత పెద్ద పెనుగులాట నే జరిగింది. ఫ్లోరా షైనీ సుమన్ శెట్టి ని టార్గెట్ చేసింది. తాను బాస్కెట్ ని కాపాడుకునే ప్రయత్నం లో సుమన్ శెట్టి ఫ్లోరా ని ఒకసారి కొడుతాడు. అంటే ఉద్దేశపూర్వకంగా కాదు అనుకోండి, ఆ టాస్క్ అలాంటిది. అప్పుడే ప్రియా వార్నింగ్ ఇస్తుంది. సుమన్ అన్నా ఇంకోసారి కొడితే టాస్క్ నుండి తప్పిస్తాను అని అంటుంది. రెండవ సారి కూడా ఆయన చెయ్యి ఫ్లోరా తలపై తగులుతుంది. దీంతో ప్రియా సుమన్ ని టాస్క్ నుండి తొలగిస్తుంది. కోపం తెచ్చుకున్న సుమన్, బాస్కెట్ ని కాళ్లతో కొట్టి వెళ్ళిపోతాడు. చూస్తుంటే ఈరోజు కూడా పెద్ద రచ్చ జరిగేలా ఉంది బిగ్ బాస్ హౌస్ లో.