Bigg Boss 9 Telugu Bharani Shankar: సీరియల్స్, సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భరణి(Bharani Shankar) ఇప్పుడు బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) లో ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన మానసిక పరిస్థితి ని ఊహించుకుంటే, జీవితం లో ఎన్నో చూసి వచ్చిన భరణి కి ఈ బిగ్ బాస్ షో అవసరమా?, ఎవరెవరితోనో లేనిపోని మాటలు అనిపించుకోవడం అవసరమా అని ఆయన అభిమానులకు అనిపిస్తుంది. కనీసం హౌస్ లో ఆయన వయస్సు కి కూడా మర్యాద ఇవ్వడం లేదు ‘అగ్నిపరీక్ష’ నుండి వచ్చిన కామనర్స్. ఈ కామనర్స్ కి ఆయన ఇండస్ట్రీ అనుభవం కి ఉన్నంత వయస్సు కూడా ఉండదు. కానీ ఆయన మీద అమర్యాదగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మనీష్, ప్రియా మరియు శ్రీజ అయితే దారుణం. రోజు రోజుకు వీళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ ని చూస్తుంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత జనాలు కొట్టేలాగా అనిపిస్తున్నారు.
ఆ రేంజ్ లో ప్రేక్షకులకు వీళ్ళ ప్రవర్తన తో పిచ్చెక్కిస్తున్నారు. టెనెంట్స్ లో ఒకరిగా ఉన్న భరణి, గత వారం శాశ్వత ఓనర్ గా హౌస్ లోపలకు అడుగుపెట్టాడు. కానీ ఓనర్స్ గా ఉన్న కామనర్స్ ఒక్కరు కూడా ఈయన్ని వారిలో కలుపుకోలేదు. ఇక మనీష్ అయితే ఆయన్ని అంటరాని వాడిగా చూస్తూ, బెడ్ ని షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇంతటి దారుణాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండము. జీవితం లో ఎన్నో చూసి వచ్చిన భరణి కి ఇలాంటివి ఎదురుకోవడం అవసరమా?..భరణి కి టెనెంట్స్ లో ఎంతో మంచి స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. కానీ ఆయన ఓనర్స్ గ్రూప్ కి వెళ్లిన తర్వాత వాళ్ళ తరుపున చాలా నిజాయితీగా గేమ్ ని ఆడాడు.
ఉదాహరణకు కెప్టెన్సీ టాస్క్ మొదటి రౌండ్ లో ఇమ్మానుయేల్ ఓనర్స్ అందరిని బయట నిల్చొని లాగి అవతల వేస్తుంటే భరణి ఆ సమయం లో ఇమ్మానుయేల్ ని కదలకుండా పట్టుకున్నాడు. ఒకవేళ వదిలేసి ఉండుంటే ఆ టాస్క్ ఓనర్స్ ఓడిపోయేవారు. కానీ ఆయన అలా చెయ్యలేదు. తాను టీం కోసమే ఆడాడు. కానీ ఓనర్స్ మాత్రం భరణి ని అసలు నమ్మలేదు. ఆయన పరోక్షంగా టెనెంట్స్ కి సహాయం చేస్తున్నాడని, నిజాయితీగా ఆడడం లేదని భరణి వెనుక చేరి మాట్లాడుకుంటున్నారు. ఇదే విషయాన్నీ సుమన్ శెట్టి తో కూడా చెప్పుకొని బాధపడతాడు భరణి. టెనెంట్స్ గ్రూప్ నుండి ఆయన్ని అభిమానించే వాళ్ళల్లో ఒకరు హౌస్ లోకి శాశ్వత ఓనర్ గా అడుగుపెడితే కానీ, ఆయనకు ఈ టార్చర్ నుండి విముక్తి లభించేలా కనిపించడం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.