Bigg Boss 9 Telugu Sreeja: ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యురాలిగా బిగ్ బాస్ హౌస్(Bigg Boss 9 Telugu) లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ దమ్ము శ్రీజా(Dammu Srija). అగ్నిపరీక్ష షో ఆడిషన్స్ సమయం లో ఈమె నవదీప్ కి తప్ప జ్యూరీ మెంబెర్స్ ఎవ్వరికి నచ్చలేదు. ఇక ఆడియన్స్ అయితే ఈమె గొంతుకి దండం పెట్టేసారు. నవదీప్ అనవసరం గా ఈమెని హోల్డ్ చేసాడని అనుకున్నారు కానీ, ఆ తర్వాత ఆమె షోలో ఆడిన టాస్కులు చూసి జ్యూరీ తో పాటు ప్రేక్షకులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఎలాంటి టాస్క్ లో అయినా దమ్ము శ్రీజా అడుగుపెట్టిందంటే గెలిచి తీరాల్సిందే, సివంగి అంటూ ఈమెని ఆడియన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తారు. అలా అగ్నిపరీక్ష షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న శ్రీజ, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది.
ప్రతీ చిన్న విషయానికి అరవడం, అవసరమైన లేకపోయినా మ్యాటర్స్ లో కూడా దూరి తన వాయిస్ ని వినిపించాలని అనుకోవడం, అతి యాటిట్యూడ్ తో టెనెంట్స్ పట్ల ఈమె ప్రవర్తించిన తీరు, ఇవన్నీ ఆడియన్స్ కి చిరాకు కలిగించిన విషయం వాస్తవమే. కానీ ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని గమనించి ఈమె తన ఆట తీరుని మార్చుకుంది. వాయిస్ ని బాగా తగ్గించింది, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే కనిపిస్తుంది. తనకు టాస్క్ ఆడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం సివంగి లాగా రెచ్చిపోతుంది. ఈ వారం ఆమెకు బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. అయితే శ్రీజ గురించి ఆమె తండ్రి దమ్ము శ్రీనివాస రావు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో శ్రీజ గురించి, తమ కుటుంబ విషయాల గురించి చెప్పకొచ్చాడు. శ్రీజ చిన్నతనం నుండి బాగా చదువుకునే అమ్మాయి అట. తనకు ఒక్క మార్కు తక్కువ వచినా ఊరుకునేది కాదట, ఏదైనా మనసులో అనుకుంటే సాధించేంత వరకు వదిలిపెట్టని అమ్మాయి అట.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అగ్నిపరీక్ష నుండి బిగ్ బాస్ కి ఎంపికైనప్పుడు మా అమ్మాయి బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పింది. అప్పటి వరకు ఆమె అగ్నిపరీక్ష షోకి వెళ్లిందనే విషయం మాకు తెలియదు. మా అమ్మాయి ఇష్టాన్ని కాదు అనలేక మేము కూడా ఆమెని ఆపలేదు. ఈ షో కోసం మా అమ్మాయి రెండు లక్షల రూపాయిలు జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసింది. చాలా మంది మా అమ్మాయి చెత్త బుట్టలు పట్టుకున్న ఫోటోని చూపించి, దానికి ఒక ఆడియో ని అటాచ్ చేసి బాగా ట్రోల్ చేస్తున్నారు. నేను ఒక పారిశుధ్య కార్మికుడిని, చెత్తని పట్టుకొని వెళ్లే పని ఎంత కష్టమైనదో ట్రోల్ చేసేవాళ్లకు తెలియదు. నా పనిని కించపరుస్తూ, నా కూతురుని ఇలా ట్రోల్ చేయడం నా మనసుకి చాలా బాధని కలిగించింది’ అంటూ చెప్పుకొచ్చాడు దమ్ము శ్రీనివాస రావు.