Kantara: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రాల్లో ఒకటి ‘కాంతారా'(Kanthara Movie). రిషబ్ శెట్టి(Rishab Shetty) హీరో గా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆ చిత్రానికి ప్రీక్వెల్ గా వచ్చిన ‘కాంతారా : చాప్టర్ 1’ కేవలం మూడు రోజుల్లోనే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ‘కాంతారా’ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేముందు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం లో రిషబ్ శెట్టి ముందుగా హీరో గా చెయ్యాలని అనుకోలేదట, కేవలం దర్శకత్వం వరకు చూసుకుంటే చాలు అని అనుకున్నాడట.
ఆయన ఈ చిత్రాన్ని ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో చెయ్యాలని అనుకున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ అంటే రిషబ్ శెట్టి కి వీరాభిమానం అనే సంగతి అందరికీ తెలిసిందే. మొదటి నుండి రిషబ్ శెట్టి ఈ విషయాన్నీ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ అయితే తానూ రాసుకున్న పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలడని బలంగా నమ్మాడట. ఒక రోజు ఎన్టీఆర్ ని కలిసి ఈ సినిమా స్టోరీ ని వినిపించగా, ఆయనకు బాగా నచ్చిందట కానీ, ఆ సమయం లో ఆయన #RRR మూవీ షూటింగ్ లో ఉండడం, తదుపరి చిత్రం ‘దేవర’ కి కూడా డేట్స్ ఇచ్చేయడం వల్ల ఈ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకొని ఈ సినిమా చేసుంటే వేరే లెవెల్ లో ఉండేది. నటుడిగా రిషబ్ శెట్టి కి ఇది మొదటి సినిమా. అయినప్పటికీ నేషనల్ అవార్డు ని అందుకున్నాడు.
అదే ఎన్టీఆర్ లాంటి అనుభవం ఉన్న నటుడు ఈ సినిమా చేసుంటే ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్లి ఉండేదో మీరే ఊహించుకోండి. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యింది. మొదటి నుండి ఎన్టీఆర్ కర్ణాటక ప్రాంతం లో బలమైన ఫ్యాన్ బేస్ తో కొనసాగుతున్నాడు. అలాంటి ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేసుంటే కచ్చితంగా కర్ణాటక ప్రాంతం లో ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళుండేది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడి స్టార్ హీరోలతో సరిసమానమైన ఇమేజ్ ఏర్పడి ఉండేది. బ్యాడ్ లక్ అంటూ ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
