Bigg Boss 9 Telugu Shrasti Verma: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు స్టార్ట్ అయింది. అయితే ఈ షోలో పాల్గొనడానికి సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పాటు కామనర్స్ సైతం బాగమవుతుండడం విశేషం… మరి ఇంతకుముందు వచ్చిన సీజన్లను మించి ఈ సీజన్ అయితే ఉండబోతుందని ముందుగానే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక బాగా బాస్ షో యాజమాన్యం దానికి తగ్గట్టుగానే మొదటి ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా లంచ్ చేయడమే కాకుండా ప్రేక్షకులు యొక్క మన్ననలు పొందుతూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది…జానీ మాస్టర్ మీద కేసు పెట్టి చాలా పాపులారిటీని సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ సైతం సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది…
జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ తో పోటీకి దిగి తన మీద కేసు పెట్టి మరి ఆ కేసు మీద ఒక్కతే నిలబడి ధైర్యంగా పోరాటం చేసింది. కాబట్టి ఆమె పోరాట పటమను గుర్తించిన బిగ్ బాస్ యాజమాన్యం ఆమె హౌస్ లో ఉంటే ప్రతి ఒక్కరి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందనే ఉద్దేశ్యంతో ఆమెను తీసుకున్నట్టుగా తెలుస్తోంది…
ఇక శ్రేష్టి వర్మ ఇంట్రాడక్షన్ లోనే నాగార్జునను మెప్పించింది. తనకోసం ఒక డాన్స్ వేయమని నాగార్జున అడగగా ‘హలో బ్రదర్’ సినిమాలలోని ‘ కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ అనే సాంగ్ మీద డాన్స్ చేసి నాగార్జున మెప్పించింది. ఇక దాంతో నాగార్జున సైతం ఈ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత శ్రేష్టి వర్మ కొరియోగ్రఫీ లో ఒక సాంగ్ చేయాలని కోరుకుంటున్నట్టుగా చెప్పాడు. దాంతో ఆమె కూడా ఇంతకంటే అదృష్టం లేదు అన్నట్టుగా తెలియజేసింది.
ఇక మొత్తానికైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టి అతనికి చుక్కలు చూపించిన శ్రేష్టి వర్మ ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళకి చుక్కలు చూపించడానికి రెడీ అవుతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలియజేసింది. మరి ఏది ఏమైనా కూడా శ్రేష్టి వర్మ ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్లందరికీ చాలా టఫ్ ఫైట్ ను ఇస్తూ ముందుకు దూసుకెళ్లడం పక్క అంటూ ఆమె అభిమానులు ఇప్పటికే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు…చూడాలి మరి హౌస్ లో ఆడే టాస్క్ లను ఆమె ఎలా ఎదుర్కొంటారు అనేది…