Bigg Boss 9 Telugu Mask Man: ‘అగ్ని పరీక్ష’ షో మొదలు అవ్వకముందే సోషల్ మీడియా నెటిజెన్స్ లో ప్రత్యేకంగా ఆసక్తి కలిగించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రమే. ఇతను ఎలా ఆడుతాడో ఏంటో అని చాలా మంది అనుకున్నారు. అగ్నిపరీక్ష షో మొదలయ్యాక ఆడిషన్స్ లో ఇతన్ని చూసి జడ్జీలు చిరాకు పడ్డారు. అయిష్టంగానే హోల్డ్ లో పెట్టారు. కానీ ‘అగ్ని పరీక్ష’ లో అతని ఆట తీరు చూసిన తర్వాత అందరూ షాక్ కి గురయ్యారు. ట్రిమ్మర్ తో గడ్డం అరగుండు చేసుకొని చెప్తే క్షణం కూడా ఆలోచించకుండా చేసేసుకున్నాడు. హౌస్ లోకి ఒకవేళ వెళ్తే షో ముగిసేవరకు అరగుండు తోనే ఉండాలని చెప్పినప్పటికీ కూడా అతను సాహసించాడు. కేవలం ఆ ఒక్క టాస్క్ మాత్రమే కాదు. అగ్నిపరీక్ష షో ముగిసేవరకు పెట్టిన ప్రతీ టాస్కు ని అద్భుతంగా ఆడాడు.
ఆడిషన్స్ సమయం లో ఇతను తన భార్య ని కొట్టాడని చెప్పడం తో జడ్జి బిందు మాధవి ఈయన్ని అసహ్యించుకుంది. ఆ తర్వాత ఇతని మెడలో లూజర్ అనే బోర్డుని కూడా తగిలించింది. ఏ బిందు మాధవి అయితే ఆ మాట అన్నాదో, అదే బిందు మాధవి చేతుల మీదుగా ఈయన నేడు హౌస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లోకి వెళ్లిన వెంటనే కంటెస్టెంట్స్ అందరికీ చాలా తేడాగా అనిపించాడు. నాగార్జున ఇమ్మానుయేల్ మరియు శ్రేష్టి వర్మ లలో ఎవరికో ఒకరికి హౌస్ మొత్తం క్లీన్ చేసే బాధ్యత ని ఇవ్వమని చెప్పగా, మాస్క్ మ్యాన్ హరీష్ ఇమ్మానుయేల్ కి హౌస్ ని ఊడ్చే పని చెప్పాడు. సెలబ్రిటీలు అనే భయం బెరుకు అతనిలో అసలు లేదు. చూస్తుంటే ఈ సీజన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది. నా ఎదుట ఎవరైనా మాస్క్ వేసుకొని తిరిగితే ఆ మాస్క్ తీయించే వరకు నేను నిద్రపోను అని నాగార్జున తో మాస్క్ మ్యాన్ చెప్పిన మాటలు హైలైట్ అయ్యాయి. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజునే మాస్క్ మ్యాన్ తన మార్క్ చూపించేసాడు. ఇక రాబోయే రోజుల్లో తనలోని ఎన్ని షేడ్స్ ని చూపిస్తాడో చూడాలి.