Bigg Boss 9 Telugu Sanjana Vs Suman Shetty: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు, ఎంతో మర్యాదగా నడుచుకుంటూ వస్తున్నా కంటెస్టెంట్స్ లో ఒకరు సుమన్ శెట్టి. కానీ ఈమధ్యనే ఈయన ఒక్కోరోజు తనలోని సరికొత్త యాంగిల్స్ ని బయటకు తీస్తూ వస్తున్నాడు. ఈరోజు అయితే పూర్తిగా తీసేసాడు. ఆయనలోని ఈ యాంగిల్స్ జనాలకు కూడా బాగా నచ్చింది, ఓట్లు భారీగానే గుద్దుతున్నారు. కానీ నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ లో సంజన పట్ల సుమన్ శెట్టి ప్రవర్తించిన తీరు మాత్రం కరెక్ట్ గా అనిపించలేదు. ఆమె బాధ ఏమిటంటే, గుడ్డు దొంగతనం చేసిన రోజు హౌస్ మొత్తం తనని టార్గెట్ చేసి తిడుతున్నారు. ఆమె అందరికీ క్షమాపణలు చెప్పుకుంటూనే వచ్చింది. ఈ గ్యాప్ లో ఆమె కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి కామెంట్స్ చేశారు. అందుకు ఆమె ఏడ్చేసింది.
ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయం లో సుమన్ శెట్టి అటు వైపు గా వచ్చి, మా కుటుంబం లో(సెలబ్రిటీస్ జాబితా) ఉన్నది 9 మంది కాదు, 8 మంది మాత్రమే అని అంటాడట. దానికి సంజన మనసు ఇంకా ఎక్కువగా నొచ్చుకుంది. ఇదే పాయింట్ ని సుమన్ శెట్టి కి నేడు చెప్పి నామినేట్ చేస్తుంది. దానికి సుమన్ శెట్టి నేను అన్నది మిమ్మల్ని కాదు, ఒకవేళ అలా అనుకోని ఉండుంటే దయచేసి నన్ను క్షమించండి అని చెప్పుంటే చాలా గౌరవం దక్కేది. కానీ ఆయన ఏమన్నాడంటే ‘ఈ హౌస్ లో అందరూ మిమ్మల్ని దొంగ అని ముద్ర వేశారు. అప్పుడు మీకు ఏమి అనిపించలేదు కానీ, నేను 8 మంది మాత్రమే అని చెప్తే మీకు బాధ వేసిందా?, ఆ 9 వ వ్యక్తి మీరే అని ఎందుకు అనుకున్నారు?, నేనే అయ్యుండొచ్చు కదా?’ అని చాలా తెలివిగా కౌంటర్ ఇచ్చాడు.
కానీ జనాలు దానిని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు కదా. హౌస్ మొత్తం ఒక సంజన ని తప్పు బడుతున్న సమయం అది. ఆ సమయం లో సుమన్ శెట్టి వచ్చి మేము 9 మంది కాదు, 8 మంది మాత్రమే అని అన్నప్పుడు అది ఎవరి గురించి అన్నారో తెలుసుకోలేంత అమాయకులు గా జనాలు ఉన్నారని సుమన్ అనుకున్నాడా?, లేకపోతే తనకు ఓట్లు వేసి మొదటి వారం సేవ్ చేసిన జనాలకు ఎదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడా అనేది తెలియాల్సి ఉంది. అంతే ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నంత సేపు సుమన్ శెట్టి సంజన తో చాలా వెటకారంగా మాట్లాడుతాడు. కానీ సంజన మాత్రం సహనం కోల్పోకుండా చాలా మర్యాదగా మాట్లాడి సుమన్ శెట్టి మాస్క్ మొత్తం విప్పేసింది.