Mohammad Yousuf: ఒక క్రికెటర్ ఆట తీరు ఎలా ఉన్నా సరే.. అతడి భాష బాగుండాలి. మాట్లాడే విధానం వినసొంపుగా ఉండాలి. టీమ్ ఇండియా లెజెండ్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన కెరియర్ లో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ.. గొప్ప గొప్ప రికార్డులను సృష్టించినప్పటికీ నేటికీ కూడా సమయమనాన్ని కోల్పోడు. అంతటి గొప్ప ఆటగాడు అయినప్పటికీ ఆచి తూచి మాట్లాడుతూ ఉంటాడు. తనకంటే చిన్న ఆటగాళ్లకు కూడా విలువ ఇస్తాడు. తనకంటే పెద్ద ఆటగాళ్లకు గౌరవం ఇస్తాడు. అందువల్లే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ను లెజెండ్ అని పిలుస్తుంటారు. అతని మాత్రమే కాదు మహేంద్ర సింగ్ ధోని.. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ.. గిల్.. సూర్య కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దది. వీరంతా కూడా క్రికెట్ లోనే ఎదిగారు. క్రికెట్ ద్వారానే గౌరవాన్ని సంపాదించారు. క్రికెట్ లోనే సరి కొత్తగా ఆవిర్భవించారు.
యువ ఆటగాళ్లకు సహజంగానే ఆవేశం ఉంటుంది. వయసు పెరుగుతున్నా కొద్ది వారిలో పరిణతి వస్తుంది. ఉదాహరణకు మంకీ గేట్ వివాదాన్ని తీసుకుంటే.. అప్పట్లో అండ్రు సైమండ్స్ హర్భజన్ సింగ్ మీద నోరు పారేసుకున్నాడు. అడ్డగోలుగా మాట్లాడాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమించమని కోరాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గతకాల క్రికెట్లో.. ఆధునిక క్రికెట్లో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఇక భారత్, పాకిస్తాన్ విషయానికి వస్తే ఎన్నో సందర్భాలలో ఉద్వేగమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. మైదానంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డ సందర్భాలు అనేకం జరిగాయి. అన్ని సందర్భాలలో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు లైన్ క్రాస్ చేసినప్పటికీ భారత ఆటగాళ్లు సమయమనాన్ని కోల్పోలేదు. పైగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు.
ఇటీవల ఆసియా కప్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలుపును దక్కించుకుంది. విజయం సాధించిన అనంతరం భారత జట్టు సారథి సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై ఆదివారం నుంచి రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలోకి పాకిస్తాన్ మార్చి ఆటగాడు మహమ్మద్ యూసఫ్ ఎంట్రీ ఇచ్చాడు. సూర్య కుమార్ మీద అడ్డగోలుగా విమర్శలు చేశాడు. సువర్ కుమార్ అంటూ చెత్త మాటలు మాట్లాడాడు. ఫిల్మీ వరల్డ్ నుంచి భారత్ బయటికి రావాలని డిమాండ్ చేశాడు. అందర్నీ మేనేజ్ చేస్తూ పాకిస్తాన్ జట్టును తీవ్రంగా ఇబ్బంది పడుతోందని భారత జట్టు మీద అతడు నోరు పారేసుకున్నాడు. భారత జట్టు గెలుపొందిన విధానం అత్యంత దారుణంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశాడు..
A low level rhetoric from Yousuf Yohana (converted) on a national TV program.
He called India captain Suryakumar Yadav as “Suar” (pig).
Shameless behaviour. And they demand respect, preach morality. pic.twitter.com/yhWhnwaYYq
— Slogger (@kirikraja) September 16, 2025