Bigg Boss 9 Telugu Sanjana Vs Pawan Kalyan: బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా వరకు సక్సెస్ ఫుల్ గా సాగుతోంది అంటూ బిగ్ బాస్ యాజమాన్యం చాలా వరకు సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి మూడోవ ఎపిసోడ్లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు అయితే జరిగాయి. ముఖ్యంగా సెలబ్రిటీ సంజన వైఖరి ప్రతి ఒక్క ఓనర్స్ కి టెనెట్స్ కి సైతం ఇబ్బంది కలిగించిందనే చెప్పాలి… వాష్ రూమ్ లో కింద షాంపూ ,కాస్మెటిక్స్ లాంటివి పెట్టకూడదు అంటూ హౌజ్ లో ఉన్న 14 మంది వాదిస్తుంటే సంజనా మాత్రం అలాగే పెడతానని స్నానానికి వెళ్ళినప్పుడు అలాగే పెట్టుకుంటానని చెప్పింది. దాంతో వాష్ రూమ్ మానిటర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ మీరు వాటిని తీసి బయట పెట్టండి అని చెప్పాడు.
Also Read: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన ఓటింగ్..సుమన్ శెట్టి,సంజన సేఫ్..డేంజర్ జోన్ లో ఊహించని కంటెస్టెంట్స్!
దానికి సంజన మాత్రం నేను అస్సలు పెట్టను అలాగే ఉంటాయి అంటూ వాదించింది. మీరు అలా పెట్టకపోతే నేను వాటిని తీసి బయట పెడతానని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పాడు. దాంతో ఆమె పెట్టండి అని చాలా క్యాజువల్ గా చెప్పింది. మీరు మళ్ళీ వాటిని అక్కడ పెట్టాడు అని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికి ఆమె మాత్రం నేను అలాగే తీసుకెళ్తానని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరికీ కోపం అయితే వచ్చింది.
ఇక ఫైనల్ గా సంజన వాటిని తీసి బయటపెట్టి తను చేసిన దానికి రియలైజ్ అయి సారి చెప్పింది. మరి ఏది ఏమైనా కూడా ఇదంతా ముందే చేసి ఉంటే బాగుండేది. ఇదంతా వినడం వల్ల ప్రతి ఒక్కరికి ఇరిటేషన్ రావడమే కాకుండా ఈ షో చూస్తున్న ప్రేక్షకులకు సైతం సంజన మీద కొంతవరకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి రూమ్ లో ఉన్నప్పుడు చాలావరకు పద్ధతిగా నడుచుకునే ప్రయత్నం అయితే చేయాలి.
అంతే తప్ప ఇతరులను ఇబ్బంది పెడితే అది వాళ్లకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గేమ్ ని గేమ్ లాగా ఆడినప్పుడు మాత్రమే బిగ్ బాస్ హౌజ్ లో ఎక్కువ కాలం పాటు నిలిచే అవకాశాలైతే ఉంటాయి. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు…