Bigg Boss 9 Telugu Suman Shetty: టెలివిజన్ రంగంలో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్… ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 9 అయితే స్టార్ట్ అయింది. ఇక ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన 3 ఎపిసోడ్స్ కి చాలా మంచి ఆదరణ అయితే దక్కింది. ఇక మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ దగ్గర పడుతున్న వేళ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారు అందరూ చాలా యాక్టివ్ గా టాస్క్ లను కంప్లీట్ చేస్తూ ముందుకు సాగుతుంటే సుమన్ శెట్టి మాత్రం చాలా సైలెంట్ గా ఉంటూ ఒక్కడే ఒంటరిగా ఉంటున్నారు. కారణం ఏంటి అనే దానిమీద క్లారిటీ అయితే ఇవ్వడం లేదు కానీ ఆయన అలా ఉండడం వల్ల టాస్క్ లను సరిగ్గా ఆడలేకపోతున్నాడు.
Also Read: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన ఓటింగ్..సుమన్ శెట్టి,సంజన సేఫ్..డేంజర్ జోన్ లో ఊహించని కంటెస్టెంట్స్!
ప్రతి విషయంలో కూడా తను ఒంటరిగా ఉంటున్నాడు. మిగతా వాళ్ళతో కలవడం లేదు, మరి ఎందుకని తను అలా మౌనంగా ఉంటున్నాడు. అనే విషయాలను కనక మనం పరిశీలిస్తే ఆయన రూమ్ లోకి వచ్చి 2, 3 రోజులు మాత్రమే అవుతోంది. కాబట్టి ఆయన ఎక్కువగా ఎవరితో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నాడట. కొన్ని రోజులు గడిస్తే కానీ నేను అందరితో యాక్టివ్ గా ఉండలేనని తనే చెప్పాడు.
మరి బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో మొదటి రోజు నుంచి చాలా యాక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. మొదటి వారం ఎలిమినేషన్ దగ్గరవుతున్న కొద్ది ఎవరు మొదటి వారం హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతారు అనే సస్పెన్స్ అయితే ఎక్కువగా పెరిగిపోతోంది. ఇక సుమన్ శెట్టి ఇలా మౌనంగా ఉండడం వల్ల తను ఎలిమినేషన్ ఆక్షన్ లోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది…
అందుకే ఇక మిగిలిన రోజులైనా సరే ఆయన యాక్టివ్ గా ఉండి అందరితో కలివిడిగా కలుస్తూ టాస్క్ లను కూడా సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసుకుంటూ ముందుకెళ్తేనే ఆయన షో లో ఉండే అవకాశాలైతే ఉన్నాయి. లేకపోతే మాత్రం ఆయన హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి…సుమన్ శెట్టి అనే కాదు ఇక మీదట కంటెస్టెంట్స్ అందరు జాగ్రత్త గా ఉండాల్సిన అవసరమైతే ఉంది…