Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో చూస్తూ ఉండగానే 82 రోజులు పూర్తి చేసుకుంది. ఇక కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ మూడు వారాలు కంటెస్టెంట్స్ అందరికీ అత్యంత కీలకం. టైటిల్ విన్నర్ నిన్న మొన్నటి వరకు ఏకపక్షంగా తనూజ గెలుచుకుంటుందని అంతా అనుకున్నారు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రేసు లోకి రావడంతో ఎవరు టైటిల్ గెలుస్తారు అనేది చెప్పడం కష్టం గా మారింది. ఓటింగ్ లో ఒకరోజు తనూజ లీడింగ్ లో ఉంటే, మరుసటి రోజు పవన్ కళ్యాణ్ లీడింగ్ లో ఉంటున్నాడు. ఇలాంటి టఫ్ పోటీ గడిచిన రెండు మూడు సీజన్స్ లో ఎప్పుడూ చూడలేదని బిగ్ బాస్ నిర్వాహకులు సైతం చెప్తున్నారు. వీళ్లిద్దరి తర్వాత ఇమ్మానుయేల్ మూడవ స్థానం లో కొనసాగుతున్నాడు. అయితే హౌస్ లో మిగిలిన 6 మందిలో ఎవరు టాప్ 5 లోకి దగ్గరగా వెళ్ళబోతున్నారో నిర్ణయించే వారం ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకంటే ఇదే కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ కి చివరి వారం. కెప్టెన్ అయిన వారు 13 వ వారం లో ఇమ్మ్యూనిటీ పొంది నేరుగా 14వ వారం లోకి అడుగుపెడతారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ మధ్య భీభత్సమైన పోటీ జరుగుతుంది, గొడవలు బాగా జరుగుతాయని అంతా అనుకున్నారు. కానీ పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం, వాళ్ళు ప్రస్తుత హౌస్ మేట్స్ తో టాస్కులు ఆడడం వంటివి చేయడంతో అనుకున్నంత ఫైర్ కనిపించడం లేదు. ఈ వారం మొదటి రోజున గత సీజన్ రన్నర్ గౌతమ్ హౌస్ లోకి వచ్చి భరణి తో గేమ్ ఆడుతాడు, ఈ గేమ్ లో భరణి ఓడిపోతాడు. ఇక ఆయన తర్వాత ప్రియాంక జైన్ తో కళ్యాణ్ పడాల గేమ్ ఆడి గెలుస్తాడు.
అయితే కళ్యాణ్ పడాల ఫౌల్ గేమ్ ఆడాడు అనేది స్పష్టమైంది. కానీ కెప్టెన్సీ కంటెండర్ అయితే అయిపోయాడు. అదే విధంగా సీజన్ 4 నుండి అలేఖ్య హారిక హౌస్ లోకి వచ్చి సుమన్ శెట్టి తో,అదే విధంగా సీజన్ 8 కంటెస్టెంట్ ప్రేరణ తనూజ తో గేమ్స్ ఆడుతారు. సుమన్ శెట్టి, తనూజ ఓడిపోయి కెప్టెన్సీ పోటీ నుండి తప్పుకుంటారు. ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్ ఇమ్మానుయేల్ తో పోటీ పడుతాడు. ఇందులో ఇమ్మానుయేల్ గెలిచి మూడవ కెప్టెన్సీ పోటీ దారుడు అవుతాడు. అదే విధంగా శోభ శెట్టి తో దివ్య, సోహైల్ తో సంజన, రీతూ చౌదరి గేమ్స్ ఆడుతారు. వీరిలో దివ్య, సంజన, రీతూ చౌదరి కెప్టెన్సీ పోటీ దారులు అవుతారు. వీరిలో ఎవరు చివరి వారం కెప్టెన్ అవుతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్ తప్ప, కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చి డేంజర్ జోన్ లో ఉన్నారు. ఒకవేళ వీరిలో ఎవరైనా కెప్టెన్ అయ్యి ఎలిమినేట్ అయితే మాత్రం ఆ బాధ మామూలు రేంజ్ లో ఉండదు అనే చెప్పొచ్చు.