Bigg Boss 9 Telugu Ramya: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆట మంచి ఆసక్తికరంగా మారింది. అందరూ తొందరగానే పాత కంటెస్టెంట్స్ తో కలిసిపోయారు కానీ, దివ్వెల మాధురి మరియు రమ్య అనేక విషయాల్లో నోరు జారేస్తున్నారు. ముఖ్యంగా దివ్వెల మాధురి అయితే తన బలుపు, పొగరు ప్రతీ సందర్భంలోనూ చూపిస్తూనే ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో ఆమె ప్రవర్తించిన తీరు అందుకు ఒక ఉదాహరణ. వంట చేయడానికి మాధురి బాగా ఆలస్యం అవ్వడం తో ఆమెని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసాడు. ప్రతీ రోజు షెడ్యూల్ ఎలా ఉండాలో చెప్పడానికి చూసాడు. అందుకు ఆమెని కూర్చోమని చెప్పినందుకు పెద్ద రాద్ధాంతం చేసింది. నేను కూర్చోను, మళ్లీ వంటింట్లోకి వెళ్ళాలి కదా అని అనడం వరకు బాగానే ఉంది. ఇక ఆ తర్వాత కూర్చోకపోతే ఊరుకోరా ఏంటి? అని వెటకారం గా మాట్లాడడం అసలు బాగాలేదు.
పవన్ కళ్యాణ్ కి ఇక్కడ కోపం వచ్చింది, అయినప్పటికీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు, ఆమెకు చాలా సున్నితంగా వివరించే ప్రయత్నం చేసాడు. కానీ ఆమె మాత్రం గొంతు పెంచుకుంటూనే పోతుంది. ఇక సహనం నశించిన కళ్యాణ్, మీరు ఇలా మాట్లాడితే, నేను కూడా వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని అంటాడు. దానికి మాధురి ఏది దమ్ముంటే మాట్లాడు చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. గొడవ సర్దుకున్న తర్వాత మళ్లీ తనూజ రెచ్చగొట్టినట్టు అయ్యింది, చివరికి కళ్యాణ్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు. అక్కడితో మ్యాటర్ మొత్తం అయిపోయింది. కానీ మాధురి మాత్రం జరిగిన ఆ గొడవకు కాస్త మూడ్ డిస్టర్బ్ అయ్యి ఒక పక్కకు వెళ్లి కూర్చుంది. ఆమె పక్కన రమ్య కూడా వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ వీళ్లిద్దరు కళ్యాణ్ గురించి మాట్లాడుకున్న మాటలు అత్యంత దారుణం అనే చెప్పొచ్చు.
ముందుగా రమ్య మాట్లాడుతూ ‘అతని స్నేహితురాలు శ్రీజ ని ఎలిమినేట్ చేయడానికి ఓటు వేశానని నా మీద పగ పెంచుకున్నట్టు ఉన్నాడు. నిన్నటి నుండి నా ముఖం వైపు కూడా చూడడం లేదు. అయితే నాకేంటి?, ఇక్కడికి వచ్చింది ఎవరికీ వాళ్ళు సొంతగా గేమ్స్ ఆదుకోవడం కోసం, బంధాలు పెంచుకోవడం కోసం కాదు. అయినా అతనికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. తనూజ మీద ఆ విధంగా చేతులు వేయడం చూసేందుకు చాలా దరిద్రం గా అనిపించింది. నాతో అలా చేస్తే క్రిందకు పడేసి తొక్కేస్తాను. తనూజ కూడా ఒక్క మాట తో అతన్ని ఆపేయొచ్చు. కానీ ఆమె కూడా అతనికి ఆ చనువు ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. దీనికి మాధురి సమాధానం చెప్తూ ‘అతని వృత్తి ఏంటి..చేసే పనులు ఏంటి..అమ్మాయిలను గోకడమే వృత్తి ఏమో’ అంటూ ఈమె కూడా దారుణమైన కామెంట్స్ పాస్ చేసింది. దీనిపై వీకెండ్ లో నాగార్జున మాట్లాడుతాడో లేదో చూడాలి.