Bigg Boss 9 Telugu Pawan Kayan: ఈ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) సీజన్ లో జరగుతున్న సంఘటనలు ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఉంటున్నాయి. ఈపాటికి టైటిల్ విన్నర్ విషయం లో అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసి ఉండేది. కానీ ఇప్పుడు గత వారం లెక్కలు మొత్తం మారిపోయాయి. ఫ్యామిలీ వీక్ లో అందరి కంటే బాగా పవన్ కళ్యాణ్ మరియు అతని ఫ్యామిలీ బాగా హైలైట్ అయ్యింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన బిడ్డ, చాలా మంచోడు, మన లాగానే సామాన్యుడు, ఇతన్ని ఎలా అయినా గెలిపించుకొని తీరాలి అని ఒక సెక్షన్ ఆడియన్స్ బలంగా ఫిక్స్ అయిపోయారు. అందుకే మొదటి వారం నుండి కనీవినీ ఎరుగని రేంజ్ లీడింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ వస్తున్న తనూజ, ఇప్పుడు రెండవ స్థానం లోకి పడిపోయిందని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.
గత వారం వరకు యూట్యూబ్ పోల్స్ లో తనూజ కి 51 శాతం ఓటింగ్ ఉంటే, పవన్ కళ్యాణ్ కి కేవలం 32 శాతం ఓటింగ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తనూజ ఓటింగ్ శాతం 37 శాతానికి పడిపోగా, పవన్ కళ్యాణ్ ఓటింగ్ శాతం 47 శాతం కి పెరిగింది. ఈ వారం ఇద్దరి మధ్య పది శాతం తేడా ఉండడం గమనార్హం. బిగ్ బాస్ హిస్టరీ లో 12 వ వారం నెంబర్ 1 స్థానం లో ఉన్న కంటెస్టెంట్ రెండవ స్థానానికి పడిపోవడం ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇదే ట్రెండ్ వచ్చే వారం ఉంటుంది అనుకుంటే పొరపాటే. తనూజ కి ఒకే ఒక్క పాజిటివ్ ఎపిసోడ్ పడినా, ఆమె గ్రాఫ్ మళ్లీ ఊహకందని స్థాయికి చేరుకుంటుంది. ఏది ఏమైనా ఈ ఇద్దరి మధ్యనే టైటిల్ రేస్ ఉంది. ఇమ్మానుయేల్ ప్రస్తుతానికి మూడవ స్థానం లో ఉన్నాడు.
Also Read: ‘వారణాసి’ స్టోరీ కి ‘ఎవెంజర్స్ : ది ఎండ్ గేమ్’ స్టోరీ మధ్య ఇంత పెద్ద లింక్ ఉందా..?
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒక యావరేజ్ కంటెస్టెంట్. ఇతనికి కంటెంట్ వస్తుంది కేవలం తనూజ కారణంగానే. తనూజ ఇతనితో స్నేహం కట్ చేసుకుంటే అసలు ఎపిసోడ్ లో కనిపించే స్కోప్ కూడా ఉండదు. అంతటి వీక్ కంటెస్టెంట్. కేవలం సానుభూతి ఓట్లు, తనూజ స్నేహం వల్లే ఇతను ఇంత దూరం వచ్చాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇమ్మానుయేల్ టాలెంట్ తో పోలిస్తే పవన్ కళ్యాణ్ సూన్యం అని చెప్పొచ్చు. కానీ ఇమ్మానుయేల్ సేఫ్ గేమ్ ప్లేయర్ అనే ముద్ర బలంగా పడిపోవడం వల్ల, అతను టైటిల్ రేస్ కి కాస్త దూరం గా జరిగాడు, లేదంటే ఇమ్మానుయేల్ మరియు తనూజ మధ్యనే టైటిల్ రేస్ ఉండేది, ఇక నాల్గవ స్థానం లో డిమోన్ కళ్యాణ్, 5 వ స్థానం లో భరణి నిలిచే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ లెక్కలు తారుమారు అవ్వొచ్చు.