Varanasi Movie Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి'(Varanasi Movie) చిత్రం గురించి సోషల్ మీడియా లో రోజుకో వార్త చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా కథ పై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. ఇందులో మహేష్ బాబు శ్రీ రాముడి వంశానికి చెందిన 40 వ తరం వాడు అని, పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయిన విలన్ పృథ్వీ రాజ్ మళ్లీ మామూలు స్థితికి రావడానికి అప్పట్లో హనుమంతుడు లక్ష్మణుడి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించిన పారిజాత పుష్పాలను తీసుకొని రావాల్సి ఉంటుంది, అందుకోసం మహేష్ బాబు ని బలవంతం గా తీసుకొచ్చి, అతన్ని అనేక విధాలుగా బెదిరించి, పారిజాత పుష్పాలను తీసుకొచ్చేలా అతన్ని ఒప్పిస్తారని, ఈ క్రమం లో ఆయన చేసే సాహసోపేతమైన ప్రయాణమే సినిమా అంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా కథ పై మరో రూమర్ కూడా వినిపిస్తోంది.
అదేమిటంటే ఈ చిత్రం లో విలన్ పాత్రదారి పృథ్వీ రాజ్ ప్రస్తుతం ఉన్న లోకం మొత్తం నాశనం చేసి, ఒక సరికొత్త లోకాన్ని సృష్టించాలని అనుకుంటాడు. అందుకు ఆయనకు ఒక అరుదైన ఆయుధం కావాలి. ఆ ఆయుధం కోసం కాలాల్లో ప్రయాణం చేయాలి. అలా మహేష్ బాబు తో కలిసి అయన త్రేతాయుగం లోకి అడుగుపెడుతాడని, అతనికి ఈ లోకాన్ని నాశనం చేసే అరుదైన ఆయుధం దొరికిన తర్వాత, అతని నుండి లోకాన్ని రక్షించడానికి మహేష్ బాబు ఏమి చేసాడు అనేదే స్టోరీ గా తీస్తున్నారని తెలుస్తోంది. బాగా గమనించి చూస్తే ఇది ‘ఎవెంజర్స్ : ది ఎండ్ గేమ్’ స్టోరీ కి చాలా దగ్గరగా ఉంది కదూ అని అంటున్నారు నెటిజెన్స్. అందులో కూడా ఇంతే, విలన్ థానోస్ ఈ లోకాన్ని సగం వరకు నాశనం చేసి కొత్తగా సృష్టించాలని అనుకుంటాడు.
అతని ప్రయత్నాలను అడ్డుకోవడానికి సూపర్ హీరోలందరూ ఏకం అవుతారు, చివరికి ఐరన్ మ్యాన్ ఇతన్ని అడ్డుకొని తన ప్రాణాలను అర్పిస్తాడు. ‘వారణాసి’ స్టోరీ థీమ్ కూడా ఇదే తరహా లో ఉంది, కానీ రాజమౌళి దీన్ని ఎలా తీర్చి దిద్దాడు అనేదే చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తమిళ హీరో మాధవన్ ని సంప్రదించాడట రాజమౌళి. త్వరలోనే ఆయన షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. శరవేగంగా టాకీ పార్ట్ ని వచ్చే ఏడాది సమ్మర్ లోపే పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. ఇక ఆ తర్వాత మూవీ టీం మొత్తం VFX వర్క్ మీదనే ద్రుష్టి పెడుతుందట.