Bigg Boss 9 Telugu Sanjana: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ కి గేమ్ చేంజర్ గా నిల్చిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సంజన గల్రాని మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా ఈమె హౌస్ లోకి అడుగుపెట్టింది. ఎందుకంటే ఈమె ఆర్టిస్ట్ గా ఫేడ్ అవుట్ అయిపోయింది. అదే విధంగా కన్నడ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని కేవలం రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది. కాబట్టి ఈ వారం కచ్చితంగా ఈమెనే ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ తన తింగరి తింగరి చేష్టలతో హౌస్ లో పుట్టించిన సెగకు కనీసం కొన్ని వారాలైనా ముఖానికి మాస్కులు తగిలించుకొని తిరుగుదామని అనుకున్న కంటెస్టెంట్స్ అందరి మాస్కులను తొలగించేసింది. అంత చేసిన తర్వాత కూడా చాలా సైలెంట్ గా ఏమి తెలియని అమాయకురాలిగా వ్యవహరించింది.
Also Read: అప్పట్లో ‘కాంతారా’ ని ఎవ్వరూ కొనలేదు..ఇప్పుడు ‘కాంతారా 2’ ఎంతకి అమ్ముడుపోయిందంటే!
బిగ్ బాస్ కి కూడా ఈమె ఆట నచ్చడం తో కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరీ పొగడ్తలతో ముంచి ఎత్తడమే కాకుండా, మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కుని ఆడేందుకు కంటెస్టెంట్స్ ని ఎంచుకోమనే పవర్ ని కూడా ఇచ్చాడు. మొత్తానికి కెప్టెన్సీ టాస్కు ఆడించింది, హౌస్ కి మొట్టమొదటి కెప్టెన్ గా కూడా నిల్చింది. కానీ ఈమె కెప్టెన్ అయ్యాక ఈమె మాటలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆమెని అడగకుండానే అందరూ ఎవరికీ తోచింది వాళ్ళు చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ఆమె ఉంటున్న కెప్టెన్ రూమ్ లోకి హౌస్ మేట్స్ ఇష్టమొచ్చినట్టు వచ్చి వెళ్తున్నారు. దొంగతనాలు విచ్చలవిడిగా చేస్తున్నారు. తిరిగి ప్రశ్నిస్తే నువ్వే దొంగతనాలు చేసావు, నీ వల్ల హౌస్ మేట్స్ అందరూ గొడవ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వొచ్చి ఇప్పుడు నీతులు చెప్తున్నావా అంటున్నారు. సంజన వీళ్ళని అసలు కంట్రోల్ చేయలేకపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
నన్ను సంతృప్తి పడేలా చేస్తే హౌస్ లో ఉన్న వాళ్లందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తాను అని సంజన కూల్ డ్రింక్స్ మొత్తాన్ని తీసుకొచ్చి పెడితే వాటిని ఇష్టమొచ్చినట్టు దొంగతనాలు చేసి పెట్టుకున్నారు. మిగతా వాళ్ళ సంగతి పక్కన పెడితే, నిద్ర లేస్తే నీతులు మాట్లాడే మాస్క్ మ్యాన్ కూడా దొంగతనం చేయడం విశేషం. ఒక్క గుడ్డు దొంగలించినందుకు సంజన ని హౌస్ మొత్తం ఒక క్రిమినల్ లాగా చూసింది. కంటెస్టెంట్స్ అందరూ ఆమెని దూరం పెట్టడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు అందరూ దొంగతనాలు చేస్తున్నారు. మరి దీనికి నేడు హోస్ట్ నాగార్జున రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. గత సీజన్ లో నాగార్జున రియాక్షన్స్ పై చాలా నెగిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది. మరి ఇప్పుడు ఆయన తన తప్పులను దిద్దుకొని హోస్టింగ్ చేస్తాడా లేదా అనేది చూడాలి.